POURNAMI GARUDA SEVA HELD _ శ్రీవారి ఆలయంలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ

TIRUMALA, 05 MAY 2023: The monthly Pournami Garuda Seva was observed with religious fervour on Friday evening at Tirumala.

 

Sri Malayappa in all His divine splendour blessed devotees all along the four mada streets on the mighty Garuda Vahanam.

 

HH Sri Pedda Jeeyar and HH Sri Chinna Jeeyar Swamis of Tirumala, DyEO Sri Lokanatham, VGO Sri Bali Reddy, Parupattedar Sri Uma Maheswara Reddy and other staff, devotees participated.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీవారి ఆలయంలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ

తిరుమ‌ల‌, 2023 మే 05: తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం రాత్రి 7 గంటలకు గరుడ వాహన సేవ ప్రారంభమైంది. సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు.

గ‌రుడ వాహ‌నం – స‌ర్వ‌పాప ప్రాయ‌శ్చిత్తం

పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.

వాహన సేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, విజిఓ శ్రీ బాలిరెడ్డి, పారుపతేధార్ శ్రీ ఉమామహేశ్వర్ రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.