POURNAMI GARUDA SEVA HELD _ వైభవంగా పుష్య‌మాస పౌర్ణమి గరుడసేవ

Tirumala, 25 January 2024: On the auspicious occasion of Pushya Pournami, Garuda Seva was observed in a grand manner at Tirumala on Thursday evening.

Sri Malayappa Swamy paraded along four mada streets on the mighty Garuda Vahanam to bless His devotees.

Temple staffs, devotees were present.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

వైభవంగా పుష్య‌మాస పౌర్ణమి గరుడసేవ

తిరుమ‌ల‌, 25 జ‌న‌వ‌రి, 2024: తిరుమలలో గురువారం రాత్రి పుష్య‌మాస పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను క‌టాక్షించారు. విశేష సంఖ్య‌లో భ‌క్తులు క‌ర్పూర‌నీరాజ‌నాలు స‌మ‌ర్పించి స్వామివారిని ద‌ర్శించుకున్నారు.

గ‌రుడ వాహ‌నం – స‌ర్వ‌పాప ప్రాయ‌శ్చిత్తం

పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.

ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.