PRACTICE WHAT YOU LEARN IN SUBHAPRADAM- TIRUPATI JEO

Tirupati, 28 May 19: TTD Joint Executive Officer for Tirupati, Sri B Lakshmikantham exhorted that the students should practice in real life what all they learn in the Subhapradam training camp.

The JEO inspected the premises of Sri SPW Degree and PG College where the Subhapradam training classes were run under the aegis of the Hindu dharma prachara Parishad (HDPP).

Speaking on the occasion the JEO urged students to imbibe national, cultural traditions and enlighten others as well. “Respect parents, teachers and religion Self-discipline is crucial for achieving goals in your life. The students should develop good habits of food, physical and mental exercises that promote growth and intelligence.

He said TTD had made all arrangements at SV Arts College, SGS Arts College, SV junior college, SPW junior college, PW Polytechnic towards boarding and lodging facilities for students.

TTD HDPP secretary Dr Ramana Prasad, Epic exams OSD Dr Damodar Naidu, PW degree college Principal Dr K Magadevammama, coordinator Dr Krishnaveni and others participated.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శుభప్రదంలో నేర్చుకున్న అంశాల‌ను ఆచ‌రించాలి : టిటిడి తిరుప‌తి జెఈవో శ్రీ బి.ల‌క్ష్మీకాంతం

మే 28, తిరుపతి, 2019: శుభ‌ప్ర‌దంలో నేర్చుకున్న అంశాల‌ను విద్యార్థులు నిజ‌జీవితంలో ఆచ‌రించాల‌ని, త‌ద్వారా భ‌విష్య‌త్తులో మంచి పౌరులుగా ఎదుగుతార‌ని టిటిడి తిరుప‌తి జెఈవో శ్రీ బి.ల‌క్ష్మీకాంతం పేర్కొన్నారు. టిటిడి హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్ ఆధ్వ‌ర్యంలో తిరుప‌తిలోని శ్రీ ప‌ద్మావ‌తి మ‌హిళా డిగ్రీ క‌ళాశాల‌లో జ‌రుగుతున్న శుభ‌ప్ర‌దం త‌ర‌గ‌తుల‌ను మంగ‌ళ‌వారం జెఈవో ప‌రిశీలించారు.

ఈ సంద‌ర్భంగా జెఈవో విద్యార్థుల‌ను ఉద్దేశించి మాట్లాడుతూ భార‌తీయ సంస్కృతి సంప్ర‌దాయాల‌ను అవ‌గాహ‌న చేసుకుని ఇత‌రుల‌కు కూడా తెలియ‌జేయాల‌న్నారు. త‌ల్లిదండ్రులు, గురువు, దైవం ప‌ట్ల గౌర‌వ‌భావాన్ని క‌లిగి ఉండాల‌ని, క్ర‌మ‌శిక్ష‌ణ‌తో జీవిత ల‌క్ష్యాల‌ను సాధించాలని సూచించారు. విద్యార్థులు మంచి అహార అల‌వాట్ల‌ను అల‌వ‌ర‌చుకోవాల‌ని, పోష‌కాహారం తీసుకోవాల‌ని కోరారు. ఆహార నియ‌మావ‌ళితోపాటు వ్యాయామం ద్వారా శారీర‌క‌, మాన‌సిక వికాసం క‌లుగుతుంద‌న్నారు. ఎస్వీ ఆర్ట్స్‌ కళాశాల, ఎస్‌జిఎస్‌ ఆర్ట్స్‌ కళాశాల, ఎస్వీ జూనియర్‌ కళాశాల, ఎస్‌పిడబ్ల్యు జూనియర్‌ కళాశాల, ఎస్‌పిడబ్ల్యు పాలిటెక్నిక్‌ కళాశాలల్లో విద్యార్థుల‌కు ఎలాంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా బోధ‌న‌తోపాటు భోజ‌నం, వ‌స‌తి క‌ల్పిస్తున్న‌ట్టు తెలిపారు.

కాగా, ఈ త‌ర‌గ‌తుల్లో భాగంగా రెండో రోజు ధ‌ర్మ‌ల‌క్ష‌ణాలు, చ‌తుర్విద పురుషార్థాలు, ఆశ్ర‌మాలు – సంస్కారాలు, మ‌హ‌ర్షుల మ‌హితోక్తులు, ప్రాచీన‌కాలంలో ధ‌ర్మ‌వీరులు, రామాయ‌ణ సందేశం అంశాల‌ను బోధించారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్ కార్య‌ద‌ర్శి డా.. ర‌మ‌ణ‌ప్ర‌సాద్‌, ధార్మిక ప‌రీక్ష‌ల ప్ర‌త్యేకాధికారి ఆచార్య జి.దామోద‌ర‌నాయుడు, ఎస్‌పిడబ్ల్యు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా..కె.మ‌హ‌దేవ‌మ్మ‌, కో-ఆర్డినేట‌ర్లు డా..కృష్ణ‌వేణి, శ్రీ‌మ‌తి ర‌మాదేవి, హెచ్‌డిపిపి ఏఈవో శ్రీ నాగేశ్వ‌ర‌రావు, సూప‌రింటెండెంట్ శ్రీ ఎంఆర్‌.గురునాథ్ ఇత‌ర సిబ్బంది పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.