PRANAYA KALAHOTSAVAM ON JAN 04 _ జనవరి 4న శ్రీవారి ప్రణయకలహోత్సవం

Tirumala, 03 January 2026: The unique festival, Pranaya Kalahotsavam, will be observed in Tirumala on January 04.

This interesting ”Love Game” of deities will take place between 4 pm and 6 pm opposite Swamy Puskharini on Saturday.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

జనవరి 4 శ్రీవారి ప్రణయకలహోత్సవం

తిరుమల, 2026 జనవరి 03: శ్రీ వేంకటేశ్వరస్వామి వారు తన దేవేరులతో క‌లిసి పాల్గొనే కలహ శృంగార భరితమైన ప్రణయ కలహోత్సవం జనవరి 4 తేదీ తిరుమలలో జరుగనుంది.

 ఉత్సవాన్ని పురస్కరించుకొని సాయంత్రం 4 గంట‌లకు స్వామివారుఅమ్మవార్ల ఉత్సవమూర్తులు బంగారు పల్లకీలపై వేరువేరుగా వైభవోత్సవ మండపం నుండి ఊరేగింపుగా బయలుదేరి శ్రీ వరాహస్వామి ఆలయం వ‌ద్ద‌ ఒకరికొకరు ఎదురేగుతారుఇక్కడ అర్చకులు స్వామిఅమ్మవార్ల తరఫున వేరువేరుగా ఆళ్వారు దివ్యప్రబంధంలోని పాశురాలను స్తుతిస్తారు తరువాత అమ్మవార్లు స్వామివారిని నిందాస్తుతి చేసిన అనంతరం ఒకరిపై ఒకరు పూల‌ బంతులను విసరడంస్వామివారు పుష్పఘాతం నుండి తప్పించుకోవడం వంటి ఆసక్తికరమైన సన్నివేశాలతో  ప్రణయకలహ మహోత్సవం నిర్వహిస్తారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.