PRANAYA KALAHOTSAVAM ON JAN 04 _ జనవరి 4న శ్రీవారి ప్రణయకలహోత్సవం

Tirumala, 03 January 2026: The unique festival, Pranaya Kalahotsavam, will be observed in Tirumala on January 04.

This interesting ”Love Game” of deities will take place between 4 pm and 6 pm opposite Swamy Puskharini on Saturday.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

జనవరి 4న శ్రీవారి ప్రణయకలహోత్సవం

తిరుమల, 2026 జనవరి 03: శ్రీ వేంకటేశ్వరస్వామి వారు తన దేవేరులతో క‌లిసి పాల్గొనే కలహ శృంగార భరితమైన ప్రణయ కలహోత్సవం జనవరి 4వ తేదీ తిరుమలలో జరుగనుంది.

ఈ ఉత్సవాన్ని పురస్కరించుకొని సాయంత్రం 4 గంట‌లకు స్వామివారు, అమ్మవార్ల ఉత్సవమూర్తులు బంగారు పల్లకీలపై వేరువేరుగా వైభవోత్సవ మండపం నుండి ఊరేగింపుగా బయలుదేరి శ్రీ వరాహస్వామి ఆలయం వ‌ద్ద‌ ఒకరికొకరు ఎదురేగుతారు. ఇక్కడ అర్చకులు స్వామి, అమ్మవార్ల తరఫున వేరువేరుగా ఆళ్వారు దివ్యప్రబంధంలోని పాశురాలను స్తుతిస్తారు. ఆ తరువాత అమ్మవార్లు స్వామివారిని నిందాస్తుతి చేసిన అనంతరం ఒకరిపై ఒకరు పూల‌ బంతులను విసరడం, స్వామివారు పుష్పఘాతం నుండి తప్పించుకోవడం వంటి ఆసక్తికరమైన సన్నివేశాలతో ఈ ప్రణయకలహ మహోత్సవం నిర్వహిస్తారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.