PRANAYA KALAHOTSAVAM ON JAN 7 _ జనవరి 7న శ్రీవారి ప్రణయకలహోత్సవం

TIRUMALA, 06 JANUARY 2023: The unique festival, Pranaya Kalahotsavam will be observed in Tirumala on January 7.

This interesting “Love Game” of deities will take place between 4pm and 6pm opposite Swamy Puskharini between 4pm and 6pm on Saturday.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జనవరి 7న శ్రీవారి ప్రణయకలహోత్సవం

తిరుమల, 2023 జనవరి 06: శ్రీ వేంకటేశ్వరస్వామి వారు తన దేవేరులతో క‌లిసి పాల్గొనే కలహ శృంగార భరితమైన ప్రణయ కలహోత్సవం జనవరి 7వ తేదీ తిరుమలలో జరుగనుంది.

ఈ ఉత్సవాన్ని పురస్కరించుకొని సాయంత్రం 4 గంట‌లకు స్వామివారు, అమ్మవార్ల ఉత్సవమూర్తులు బంగారు పల్లకీలపై వేరువేరుగా వైభవోత్సవ మండపం నుండి ఊరేగింపుగా బయలుదేరి శ్రీ వరాహస్వామి ఆలయం వ‌ద్ద‌ ఒకరికొకరు ఎదురేగుతారు. ఇక్కడ అర్చకులు స్వామి, అమ్మవార్ల తరఫున వేరువేరుగా ఆళ్వారు దివ్యప్రబంధంలోని పాశురాలను స్తుతిస్తారు. ఆ తరువాత అమ్మవార్లు స్వామివారిని నిందాస్తుతి చేసిన అనంతరం ఒకరిపై ఒకరు పూల‌ బంతులను విసరడం, స్వామివారు పుష్పఘాతం నుండి తప్పించుకోవడం వంటి ఆసక్తికరమైన సన్నివేశాలతో ఈ ప్రణయకలహ మహోత్సవం నిర్వహిస్తారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.