PRANAYA KALAHOTSAVAM PERFORMED WITH RELIGIOUS FERVOUR IN TIRUMALA _ తిరుమలలో కనులపండుగగా స్వామి-అమ్మవార్ల ప్రణయకలహోత్సవం
TIRUMALA, DECEMBER 22: The festival of “Pranaya Kalahotsavam” has been performed with utmost relgious fervour in Tirumala on Wednesday evening.
This festival was performed on the 17th day of the ongoing Adhyayanotsavam in Tirumala. The processional deities of Lord Malayappa Swamy and his two consorts seated on finely decked separate “pallaki” taken on a procession in the opposite directions at around 4:30pm. After reaching near the Varaha Swamy shrine, a priest on behalf of Goddesses and another priest on behalf of Lord chanted some hymns taken from Alwar Divya Prabhandha, Puranas and Vedas in the “Nindastuti” form which are called Perumal Varthai and Thayar Varthai.
With the consorts throwing the floral balls at the lord Malayppa Swamy and the Lord escaping from the spot to avoid their floral strokes, the fun filled unique festival-Pranaya Kalahotsavam has come to an end at around 6:30pm. TTD officials, temple preists, pilgrims and others took part in the festival.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తిరుమలలో కనులపండుగగా స్వామి-అమ్మవార్ల ప్రణయకలహోత్సవం
తిరుమల, 2010 డిశెంబర్-22: నిత్యం భక్తుల కోరికలు ఈడేర్చడంలో క్షణం తీరికలేకుండా గడిపే స్వామివారు తన దేవేరులతో పాల్గొనే కలహ శృంగార ఉత్సవమైన ప్రణయకలహోత్సవం తిరుమలలో అత్యంత వైభవంగా జరిగింది.
సాధారణంగా అధ్యయనోత్సవంలో 17వ రోజున ఈ ప్రణయకలహోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితి. బుధవారం నాడు తిరుమలలో మళయప్పస్వామి దేవేరుల ఉత్సవర్లు బంగారు పల్లకీలపై సాయంత్రం 4 గంటల ప్రాంతంలో వేరు వేరుగా వేంచేపు చేసి వరహస్వామి ఆలయం చెంత ఒకరికొకరు ఎదురేగారు. అనంతరం అమ్మవార్ల వైపు ఒక పౌరాణికుడు, స్వామివారివైపు మరో పౌరాణికుడు వారి వారి తరపున ఒకరిపై ఒకరు నిందాస్తుతి చేశారు. ఈ నిందాస్తుతి శ్లోకాలు అళ్వారు దివ్యప్రబంధములోని కొన్ని పాసురాలు మరియు పురాణ-వేదాలలోని కొన్ని ఘట్టాల నుండి స్తుతించారు. వీటినే ”పెరుమాళ్ వారై ్త”, ”తాయార్ వారై ్త” అని వ్యవహరిస్తారు. అమ్మవార్లు స్వామివారిని నిందాస్తుతి చేసిన అనంతరం కోపంతో పూబంతులను స్వామివారిపై విసరడం, స్వామివారు వారి పుష్పఘాతం నుండి తప్పించుకొనే యత్నం చేయడం వంటి ఆసక్తికరమైన సంఘటనలు, ఈ ఉత్సవాన్ని తిలకిస్తున్న భక్తులను ముగ్ధులను చేశాయి. దీనితో ఈ ప్రణయకలహోత్సవ పర్వం కన్నుల పండుగగా ముగిసింది.
నిత్యకళ్యాణం పచ్చతోరణంగా భాసిల్లే తిరుమల దివ్యక్షేత్రంలో స్వామివారికి రోజూ ఏదోఒక ఉత్సవం జరగడం ఆనవాయితీ. స్వామివారి ఉత్సవాల్లో చాలా వరకు భక్తిరసంతో కూడినవైతే, ఈ ప్రణయకలహోత్సవం అటు భక్తిరసంతో పాటుగా ఇటు శృంగార రసాన్ని కూడా మేళవించి భక్తులకు ఒక మధురమైన అనుభూతిని కలిగిస్తుంది.
ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.