PRAYED HILL LORD TO BESTOW HIS BLESSINGS ON ENTIRE HUMANITY-HON’BLE PM OF NEPAL_ సమస్త మానవాళికి శ్రీవారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించా : నేపాల్‌ ప్రధాని గౌ|| శ్రీ షేర్‌ బహదూర్‌ దేవ్‌బా

Tirumala, 26 August 2017: “I prayed the Hill Lord Venkateswara to bestow His benign blessings on the entire humanity”, said the Honourable Prime Minister of Nepal Sri Sher Bahadur Deuba.

The revered foreign dignitary along with his entourage offered prayers in the famous hill shrine of Lord Venkateswara in Tirumala on Saturday.

After Darshan speaking to media persons, the Hon’ble PM of Nepal said, its been a great to have darshan of Lord Venkateswara. “The traditions, culture and faith of both Nepal and India are same. I prayed Lord to bless both the countries and humanity with prosperity”, he reiterated.

Earlier he was accorded warm reception on his arrival at the main entrance by TTD EO Sri Anil Kumar Singhal, Tirumala JEO Sri KS Sreenivasa Raju and team of archakas. Later the dignitaries were guided to the temple. The Honourable PM of Nepal and his entourage offered obeisance in front of Lord.

In Ranganayakula Mandapam the head of Nepal and others were offered Vedasirvachanam by team of Vedic Scholars. Later Sri Deuba along with his spouse Dr.Arzu Rana Deuba were offered with Teertha Prasadams, lamination photo and Sesha Vastram of Lord Venkateswara.

Hon’ble Minister Sri K.Srinivasa Rao, Dist Collector Sri Pradhyuma, Temple DyEO Sri Rama Rao, Reception Officials Sri Haridranath, Sri Lakshminarayana Yadav and other officials were present.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

సమస్త మానవాళికి శ్రీవారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించా : నేపాల్‌ ప్రధాని గౌ|| శ్రీ షేర్‌ బహదూర్‌ దేవ్‌బా

ఆగస్టు 26, తిరుమల, 2017: ప్రపంచ మానవాళికి శ్రీవారు ఆశీస్సులు అందించాలని ప్రార్థించినట్టు నేపాల్‌ దేశ ప్రధానమంత్రి గౌ|| శ్రీ షేర్‌ బహదూర్‌ దేవ్‌బా ఉద్ఘాటించారు. నేపాల్‌ ప్రధాని శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

స్వామివారి దర్శనానంతరం ఆలయం వెలుపల గౌ|| శ్రీ షేర్‌ బహదూర్‌ దేవ్‌బా మీడియాతో మాట్లాడుతూ నేపాల్‌, భారతదేశాల మధ్య సాంస్కృతికంగా, భౌగోళికంగా విడదీయరాని సంబంధం ఉందన్నారు. శ్రీవారిని దర్శించుకోవడం సంతోషకరమని తెలిపారు.

ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న గౌ|| ప్రధానికి టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, అర్చకులు బృందం కలిసి సంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు. శ్రీవారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం టిటిడి ఈవో, జెఈవో కలిసి శ్రీవారి తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటాన్ని గౌ|| ప్రధానికి అందజేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కాల్వ శ్రీనివాసులు, కలెక్టర్‌ శ్రీ పిఎస్‌.ప్రద్యుమ్న, టిటిడి సివిఎస్‌వో శ్రీ ఆకె రవికృష్ణ, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ కోదండరామారావు, రిసెప్షన్‌ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్‌ ఇతర అధికార ప్రముఖులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.