PRAYED SRIVARU FOR THE RELIEF OF ENTIRE HUMANITY FROM CORONA VIRUS- TTD CHAIRMAN

Tirumala, 4 Jun. 20: TTD Chairman Sri YV Subba Reddy on Thursday said he prayed Lord Venkateswara to bestow His blessings on everyone and save humanity from the deadly pandemic of Corona COVID 19 virus.

Participating in the three-day ritual of Jyestabhisekam which commenced in Srivari temple on Thursday morning the TTD chairman told reporters who met him infront of Srivari temple, Srivari darshan will commence from June 8, Monday onwards on a trial basis.

He said elaborate arrangements have been made by authorities for darshan keeping in view COVID restrictions.

He said the sacred festival of Jyestabhisekam was held in Ekantham in the Jyesta masam this year in view of Covid-19 restrictions.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI    

ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నా : టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి         
 
తిరుమల, 2020 జూన్ 4: శ్రీ వేంకటేశ్వర స్వామి దయవల్ల కరోనా వ్యాధి పూర్తిగా తొలగిపోయి  ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని స్వామి వారిని కోతుకున్నానని టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం నుండి ప్రారంభమైన  జ్యేష్టాభిషేకం లో ఆయన పాల్గొన్నారు. 
 
అనంతరం శ్రీవారి ఆలయం ఎదుట తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. ప్రతి ఏటా జ్యేష్ట మాసం ప్రారంభం నుంచి మూడు రోజుల పాటు స్వామి వారికి జ్యేష్టాభిషేకం జరుపుతారని అన్నారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఈ సారి జ్యేష్టాభిషేకం ఏకాంతంగా  నిర్వహిస్తున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ నిబంధనల్లో ఇచ్చిన సడలిపులు, అనుమతుల నేపథ్యంలో ఈ నెల 8 వ తేదీ నుంచి స్వామి వారి దర్శనాలు ప్రారంభించడానికి కసరత్తు చేస్తున్నట్లు చైర్మన్ తెలిపారు. స్వామి వారి దయవల్ల అంతా మంచి జరిగి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలన్నారు.     
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారి చే జారీ చేయబడినది.