PRECIOUS JEWELS GIFTED TO LORD SRI KODANDA RAMA_ శ్రీ కోదండరామస్వామివారికి కానుకగా తిరుమల శ్రీవారి ఆలయం నుండి ఆభరణాలు బహూకరణ

Tirupati, 20 March 2018: On the occasion of Garuda Seva on Tuesday evening, a set of precious jewels from the coffers of Tirumala temple were gifted to Lord Sri Kodanda Rama Swamy.

The jewels comprised precious stones studded hair ornament for Goddess Sita Devi, golden Left and Right hand armours, two special jewels “Seema Kamalams” .

Tirumala temple DyEO Sri Harindranath along with Bokkasam in-charge Sri Guru Raja Rao and AVSO Sri Kurma Rao reached Anjaneya Swamy temple opposite Sri Kodanda Ramalayam. They have handed over the ornaments to Sri Kodanda Rama Swamy temple DyEO Smt Jhansi.

These jewels were decorated to Lord Sri Kodanda Rama Swamy for Garuda Seva which was held in the evening.

AVSO Sri Ganga Raju, Superintendent Sri Munikrishna Reddy, temple inspectors Sri Muralikrishna, Sri Sesha Reddy were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

శ్రీ కోదండరామస్వామివారికి కానుకగా తిరుమల శ్రీవారి ఆలయం నుండి ఆభరణాలు బహూకరణ

మార్చి 20, తిరుపతి, 2018: టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీకోదండరామస్వామివారికి మంగళవారం సాయంత్రం తిరుమల శ్రీవారి ఆలయం నుండి నాలుగు బంగారు ఆభరణాలను బహుమానంగా అందించారు. వీటిలో ఒక రత్నాలు చెక్కిన జడబిల్ల, శ్రీరాములవారి బంగారు కుడి హస్తం, శ్రీరాములవారి బంగారు ఎడమ హస్తం, రెండు శీమకమలములు పొదిగిన బంగారు పాద కవచాలు ఉన్నాయి.

టిటిడి అనుబంధ ఆలయాల్లో బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారి ఆలయం నుండి ఆభరణాలు బహుమానంగా అందించడం ఆనవాయితీగా వస్తోంది. ముందుగా శ్రీవారి ఆలయ డెప్యూటి ఈవో శ్రీ హరీంద్రనాథ్, బొక్కసం బాధ్యులు శ్రీ గురురాజారావు, ఎవిఎస్వో శ్రీ కూర్మారావు కలిసి శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం వద్దకు ఈ ఆభరణాలను తీసుకొచ్చారు. అక్కడ ఆలయ డెప్యూటి ఈఓ శ్రీమతి ఝాన్సీకి అప్పగించారు.
అక్కడి నుండి శ్రీ కోదండరామాలయానికి తీసుకెళ్లారు. గరుడసేవలో స్వామివారికి ఈ ఆభరణాలను అలంకరించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్‌ శ్రీ మునికృష్ణారెడ్డి, ఎవిఎస్‌వో శ్రీ గంగరాజు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ శేషారెడ్డి, శ్రీ మురళీకృష్ణ పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.