PREFERENCE TO COMMON DEVOTEES IN ALLOTMENT OF ACCOMMODATION _ వసతి కేటాయింపులో సామాన్య భక్తులకు పెద్దపీఠ: డిప్యూటీ ఈవో శ్రీ భాస్కర్
Addressing a media conference at the media centre set up in Ram Bhageecha-2 in Tirumala on Wednesday, he said that despite the VIP visit on the first day of Brahmotsavams, rooms have been allotted to devotees in a convenient manner.
About 2500 rooms have been allocated for common devotees every day during Brahmotsavams.
He informed that the pressure for accommodation rooms has reduced with the availability of the new PAC 5 in Tirumala. He said that 2400 lockers are available for devotees with the facilities of Annaprasadam and Kalyanakatta.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
వసతి కేటాయింపులో సామాన్య భక్తులకు పెద్దపీఠ: డిప్యూటీ ఈవో శ్రీ భాస్కర్
తిరుమల, 2025 అక్టోబర్ 01: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన సామన్య భక్తులకు వసతి కేటాయింపులో పెద్దపీఠ వేసినట్లు టీటీడీ వసతి విభాగం డిప్యూటీ ఈవో శ్రీ భాస్కర్ అన్నారు. తిరుమలలోని రామ్ భగీచా-2లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్ లో ఆయన బుధవారం ఉదయం మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ గరుడవాహనం రోజున వీఐపీల రద్దీ అధికంగా ఉన్నప్పటికీ సామాన్య భక్తులకు దాదాపు 2500 గదులు కేటాయించామని చెప్పారు. సాధారణ రోజుల్లో సామన్య భక్తులకు 50 శాతం కేటాయిస్తున్నట్లు తెలిపారు.
తిరుమలలో నూతన యాత్రికుల వసతి సముదాయం -5 అందుబాటులోకి రావడంతో వసతి గదుల కోసం ఒత్తిడి తగ్గిందని తెలియజేశారు. ఇందులో 2400 లాకర్లు భక్తులకు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.అన్నప్రసాదం, కల్యాణకట్ట సౌకర్యాలను అందుబాటులో ఉంచి 10వేల మంది భక్తులకు వసతి కల్పించే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు.

