TTD EO OFFERS SILK VASTRAMS TO BHAKTAVATSALA PERUMAL _ తిరునిన్రవూరులోని శ్రీ భక్తవత్సల పెరుమాళ్‌ స్వామివారికి టిటిడి ఈవో పట్టువస్త్రాలు సమర్పణ

Tirumala, 7 April, 2018: TTD EO Sri Anil Kumar Singhal on Saturday offered silk vastrams on behalf of Lord Venkateswara to the famous shrine of Sri Bhaktavatsala Perumal in Tiruninravur in Tiruvallur district of Tamilnadu.

Earlier he reached Pedda Jiyar mutt here and later proceeded to this ancient shrine carrying silk vastrams over his head.

Speaking on this occasion he said, since 2010, TTD has been offering silk vastrams to the temple as Tirumala Pedda Jiyangar is the chief pontiff of this famous shrine also.

Later he had darshan of Sri Bhakta Vatsala Perumal, one of the most important Sri Vaishnava temples among Divya Desams in the country.

Bokkasam Incharge Sri Guru Raja Swamy also accompanied TTD EO.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

తిరునిన్రవూరులోని శ్రీ భక్తవత్సల పెరుమాళ్‌ స్వామివారికి టిటిడి ఈవో పట్టువస్త్రాలు సమర్పణ

ఏప్రిల్‌ 07, తిరుపతి 2018: తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా, తిరునిన్రవూరులో గల చారిత్రక పురాతనమైన శ్రీభక్తవత్సల పెరుమాళ్‌ ఆలయానికి శనివారం సాయంత్రం టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ పట్టువస్త్రాలు సమర్పించారు. టిటిడి శ్రీ పెద్దజీయర్‌స్వామివారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ పెద్దజీయర్‌స్వామివారు ఈ ఆలయానికి ఆధ్యాత్మికపెద్దగా వ్యవహరిస్తున్నారు. శ్రీపెద్దజీయర్‌స్వామివారి కోరిక మేరకు 2010వ సంవత్సరం నుండి ఈ ఆలయ బ్రహ్మూెత్సవాలను పురస్కరించుకుని టిటిడి శ్రీవారి కానుకగా పట్టువస్త్రాలు సమర్పిస్తోంది.

ముందుగా తిరునిన్రవూరులోని శ్రీ పెద్దజీయర్‌స్వామివారి మఠానికి టిటిడి ఈవో చేరుకున్నారు. అక్కడి నుంచి ఊరేగింపుగా ఆలయం వద్దకు చేరుకుని శ్రీ భక్తవత్సల పెరుమాళ్‌కు పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ బ్రహ్మూెత్సవాల సందర్భంగా ఎనిమిదేళ్లుగా టిటిడి నుంచి పట్టువస్త్రాలు సమర్పిస్తున్నట్టు తెలిపారు. తిరు అనగా ‘శ్రీ లక్ష్మీ’ అని, నిన్ర అనగా ‘నిలబడి’ అని, వూరు అనగా ‘ప్రదేశం’ అని అర్థమని, శ్రీలక్ష్మీదేవి నిలబడి ఉన్న ప్రదేశంగా తిరునిన్రవూరు గుర్తింపు పొందిందని వివరించారు. 108 దివ్యదేశాల్లో ఈ ఆలయం ఒకటి అని చెప్పారు.

ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ బొక్కసం బాధ్యులు శ్రీ గురురాజారావు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.