PRESIDENT OFFERS PRAYERS IN SAPTHGIRI GOPRADAKSHINA MANDIRAM _ సప్త గో ప్రదక్షిణ మందిరాన్ని దర్శించిన గౌ : రాష్ట్రపతి శ్రీమతి ముర్ము 

TIRUPATI, 05 DECEMBER 2022: The Honourable President of India Smt Droupadi Murmu paved her visit to Sapthagiri Gopradakshina Mandiram located at Alipiri on Monday.

On her arrival she was offered Purnakumbha Swagatham by the Vedic Pundits and was received by TTD Trust Board Chairman Sri YV Subba Reddy, EO Sri AV Dharma Reddy, JEO (E and H) Smt Sada Bhargavi and CVSO Sri Narasimha Kishore.

She later had Darshan of Sri Venugopala Swam, performed Go Pradakshina and offered fodder and new vastrams to these Desi bovines. Later she donated an amount of Rs.6000 equal to the weight of a cow weighing around 435kilos in Go Tulabharam.

Union Minister Sri Kishen Reddy, DyCMs of AP Sri Narayana Swamy, Sri Satyanarayana, AP Minister Smt Roja Donor of Gomandiram and LAC Chief for Chennai Sri Sekhar Reddy, Tirupati Collector Sri Venkatramana Reddy, CE Sri Nageswara Rao, Gosala Director Dr Harnath Reddy were present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

సప్త గో ప్రదక్షిణ మందిరాన్ని దర్శించిన గౌ : రాష్ట్రపతి శ్రీమతి ముర్ము

తిరుపతి 5 డిసెంబరు 2022: భారత గౌరవ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము సోమవారం అలిపిరి వద్ద గల సప్త గో ప్రదక్షిణ మందిరాన్ని దర్శించుకున్నారు.

మందిరం వద్దకు చేరుకున్న గౌరవ రాష్ట్రపతికి టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి, ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి, జేఈవో శ్రీమతి సదా భార్గవి, సీవీఎస్వో శ్రీ నరసింహ కిషోర్ స్వాగతం పలికారు. అర్చకులు సంప్రదాయ బద్ధంగా పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం గౌరవ రాష్ట్రపతి శ్రీ వేణుగోపాల స్వామిని దర్శించుకున్నారు. అర్చకుల ఆశీర్వాదం అనంతరం ఆమె గో ప్రదక్షిణ చేశారు. గోవులకు అరటిపళ్ళు, మేత తినిపించి వాటికి నూతన వస్త్రాలు సమర్పించి నమస్కరించారు. అనంతరం గో తులాభారంలో గోవును ఉంచి దాని బరువుకు సరిపడేలా 435 కిలోల సమగ్ర దాణాను విరాళంగా అందించారు. ఇందుకు సంబంధించిన రూ 6 వేల రూపాయలను గౌరవ రాష్ట్రపతి గో మందిరం అధికారులకు అందజేశారు.

ఉప ముఖ్యమంత్రులు శ్రీ నారాయణ స్వామి ,శ్రీ కొట్టు సత్యనారాయణ , కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి శ్రీమతి ఆర్ కె రోజా , జిల్లా కలెక్టర్ శ్రీ వెంకటరమణా రెడ్డి , సప్త గో ప్రదక్షిణ మందిరం నిర్మాణ దాత, చెన్నె టీటీడీ స్థానిక సలహా మండలి చైర్మన్ శ్రీ శేఖర్ రెడ్డి, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వర రావు, గో శాల డైరెక్టర్ డాక్టర్ హరనాథ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.