PRESIDENT OFFERS PRAYERS TO LORD VENKATESWARA _ శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్‌ కోవింద్‌

AP GOVERNOR ACCOMPANIES PREZ

Tirumala, 24 Nov. 20: The Honourable President of India, Sri Ramnath Kovind on Tuesday afternoon offered prayers in Srivari temple at Tirumala along with his spouse Smt Savita and daughter Ms.Swathi. The Honourable Governor of Andhra Pradesh Sri Biswabhushan Harichandan also accompanied the President and his entourage.

‌Following the temple tradition, the President initially offered prayers to Swami Pushkarini and later had darshan of Sri Varahaswami.

There after when the President reached the Srivari temple, he was received by the TTD Chairman Sri YV Subba Reddy along with TTD EO Dr KS Jawahar Reddy, Additional EO Sri AV Dharma Reddy and CVSO Sri Gopinath Jatti. The temple Archakas welcomed the first citizen of India with the traditional Istikaphal honours. 

The President and his entourage went for Srivari Darshan and offered prayers to the presiding deity of Lord Venkateswara inside sanctum santorum. The chief priest explained about the significance of the Mula Virat, the jewels adorned to the lord and Kshetra Mahatyam.

Later the President and his entourage were offered Veda Ashirvachanam at Ranganayakula Mandapam.

The TTD Chairman and EO together presented Srivari Theertha Prasadams and laminated photo of Lord Venkateswara along with 2021 TTD Diaries and Calendars to the President. They also presented prasadams, photo of lord, calanders and diaries to Governor of AP Sri Biswabhushan Harichandan.

Both the Senior and Junior Pontiffs of Tirumala, District collector Sri Narayana Gupta, Tirupati Urban SP Sri Ramesh Reddy, Temple DyEO Sri Harindranath, DyEO Reception Sri Balaji were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్‌ కోవింద్‌
 
తిరుమల, 2020 న‌వంబ‌రు 24: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం రాష్ట్రపతి  శ్రీ రామ్‌నాథ్‌ కోవింద్‌ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. వీరితోపాటు రాష్ట్ర గవర్నర్‌ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్‌ ఉన్నారు.
 
రాష్ట్రపతి మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం తిరుమల శ్రీ పద్మావతి విశ్రాంతి భవనం నుండి బయలుదేరి క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ ముందుగా శ్రీ వరాహస్వామివారి దర్శనం  చేసుకున్నారు.
 
అక్కడి నుంచి శ్రీవారి ఆలయానికి చేరుకున్న రాష్ట్రపతికి టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్ రెడ్డి, అదనపు ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి అహ్వానం పలికారు. అర్చక బృందం ఆలయ మర్యాదలతో ఇస్తికఫాల్  స్వాగతం పలికారు. ఆలయంలో ధ్వజస్తంభానికి నమస్కరించిన అనంతరం రాష్ట్రపతి శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకస్వాములు వారికి స్వామివారి శేషవస్త్రం అందజేశారు.
 
అనంతరం రంగనాయకుల మండపంలో రాష్ట్రపతికి వేదపండితులు వేదాశీర్వచనం చేశారు.  ఛైర్మ‌న్, ఈవో కలిసి శ్రీవారి తీర్థప్రసాదాలను, స్వామివారి చిత్రపటాన్ని, 2021 క్యాలెండర్, డైరీని రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్‌ కోవింద్‌, రాష్ట్ర గవర్నర్‌  శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్‌కు అందజేశారు.
 
ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ నారాయణ స్వామి, కలెక్టర్ శ్రీ భరత్ నారాయణ గుప్తా, డిఐజి శ్రీ క్రాంతిరాణా టాటా, టిటిడి సివిఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టి, తిరుపతి అర్బన్‌ ఎస్‌పి శ్రీ ర‌మేష్‌రెడ్డి, డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. 
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.