PRINCIPAL SECRETARY AP REVENUE ENDOWMENTS TAKES CHARGE AS TTD EO (FAC) _ టిటిడి ఈఓ(ఎఫ్ఎసి)గా శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ బాధ్యతలు స్వీకరణ

TIRUMALA, 23 DECEMBER 2022: The Principal Secretary AP Revenue Endowments, Sri Anil Kumar Singhal took charge as Executive Officer of TTD (FAC) in Tirumala temple on Friday.

The event took place at Ranganayakula Mandapam followed by oath-taking ceremony in the presence of Sri Venkateswara Swamy at Bangaru Vakili. The oath was administered by Additional EO (FAC) Sri Veerabrahmam.

Later at Ranganayakula Mandapam, the EO (FAC) was rendered Vedasirvachanam by Vedic Pundits followed by the presentation of Theertha Prasadams, laminated photo of Srivaru, TTD Calendar and Diary 2023.

JEO (E and H) Smt Sada Bhargavi, CVSO Sri Narasimha Kishore, DyEOs Smt Kasturi, Sri Ramesh Babu, Sri Harindranath and others were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

టిటిడి ఈఓ(ఎఫ్ఎసి)గా శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ బాధ్యతలు స్వీకరణ

తిరుమల, 23 డిసెంబరు, 2022: టిటిడి ఈఓ(ఎఫ్ఎసి)గా శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ శుక్రవారం ఉదయం శ్రీవారి ఆలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఈ కార్యక్రమం జరిగింది.

అనంతరం బంగారు వాకిలి వద్ద ప్రమాణ స్వీకారం చేశారు. అదనపు ఈఓ(ఎఫ్ఎసి) శ్రీ వీరబ్రహ్మం వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా అదనపు ఈఓ(ఎఫ్ఎసి) శ్రీ వీరబ్రహ్మం, జెఈఓ శ్రీమతి సదా భార్గవి కలిసి శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందించారు.

ఈ కార్యక్రమంలో సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్, డెప్యూటీ ఈఓలు శ్రీమతి కస్తూరి బాయి, శ్రీ రమేష్ బాబు, శ్రీ హరీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు.
           
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.