ARRANGEMENTS FOR SRIVARI ANNUAL BRAHMOTSAVAMS REACHES PINNACLE_ తిరుమ‌ల శ్రీ‌వారి బ్ర‌హ్మ‌త్స‌వాల‌కు విస్తృత ఏర్పాట్లు – భ‌క్తుల సౌక‌ర్యాల‌కు పెద్ద పీట‌

Tirumala, 22 September 2019: With just less than a week left for the mega religious festival of annual brahmotsavams in Tirumala, all the arrangements by various departments for the big event reached its pinnacle. TTD has rolled out massive arrangements to ensure that lakhs of devotees who throng Tirumala during the Srivari annual Brahmotsavams without any hassle.

On the directions of TTD Executive Officer Sri Anil Kumar Singhal, Special Officer Sri AV Dharma Reddy has undertaken steps to coordinate all departments and provide devotees a comfortable darshan of Vahana Sevas in mada streets and also the darshan of Mula Virat in Srivari temple.

EXTENSIVE PUBLICITY FOR BRAHMOTSAVAMS:

TTD has launched wide publicity programme by printing 12000 wall posters, one lakh pamphlets,4500 booklets in Telugu Tamil, Hindi, Kannada and English for the benefit of devotees.

The information booklets on vahana sevas and other facilities available provided by TTD to pilgrims are also available at all the Information Kiosks or May I Help You centers located in Tirupati and also at Sarva darshan token issuing counters.

The Brahmotsavam wall posters are being displayed at TTD Kalyana mandapams and also pasted on inter and intrastate RTCbuses, Tourism department vehicles to other states etc. TTD Public Relations department roped in Srivari Sevakulu to arrange, paste and distribute these materials.

ENGINEERING DEPARTMENT:

CIVIL WING:

The TTD Engineering Department is fine-tuning colourful and bright decorations along the four Mada streets. Barricades and queue line gates, repairs to toilets, drinking water taps are all put up. Special brass grills were set up with granite pillars at Swami Pushkarani. Paintings and repairs completed on all thoroughfares and ghat roads to give festival ambiance to devotees. Additional parking space and mobile toilets are also set up near Alipiri as well. The Rangoli works are under progress to give enhanced look the hill town in and outside the temple.

ELECTRICAL WING:

The TTD Electrical wing has been tasked to put up colourful LED light decorations and electrical cutouts at vital places in Tirumala and Tirupati. Nearly 37(34 in Tirumala and 3 in Tirupati) huge display screens were also spruced up besides radio and broadcasting beaming to keep devotees enthralled and excited. The Hilltown is decked up with 41 huge electrical themes, 15 arches giving a grand look for the annual event.

VIGILANCE:

To provide theft free and stampede free environment to millions of devotees coming for Brahmotsavams about 6000 security personnel including 1200 TTD cops, 3500 Srivari Sevakulu, 1000 Scouts and Guides will be deployed at vital points while 1650 cc cameras will vigil the Hill Town during Brahmotsavams. In view of the huge crowds for Garuda Seva on October 4, TTD has banned plying of two-wheelers on ghat roads from Midnight of October 3 to the morning of October 5.

TTD has prepared an action plan for providing maximum facilities to devotees with well-knit coordination between employees of Srivari temple, Anna Prasadam, Accommodation, Kalyana Katta, Medical, Health and PR department with additional staff. Staff from each of this department will function 24X7 in Command Control Centre at Tirumala during brahmotsavams. An exclusive toll-free number is also available during brahmotsavams to which the devotees can raise
their queries: 1800 425 4242.

ANNAPRASADAM AND HEALTH:

While Annaprasada and Health wings are gearing up for the big festival with their arrangements of the different menu at different point of time during vahana sevas especially on Garuda Seva day and also at Vaikuntham queue complex, outside lines etc. The Health Department has also deployed additional manpower to keep Tirumala clean and hygienic in spite of the anticipated heavy influx of pilgrims.

EXHIBITION:

TTD has also put up grand exhibition stalls at Kalyana Vedika with a display of colorful flowers and fruits, Museum, Ayurveda, Sculpture, TTD forest and garden departments. Arrangements were also complete for artists from over 14 states to display their culture and art forms under the aegis of HDPP and other cultural projects of TTD.


ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీవారి బ్ర‌హ్మోత్స‌వాల ప్ర‌త్యేక వ్యాసం

తిరుమ‌ల శ్రీ‌వారి బ్ర‌హ్మ‌త్స‌వాల‌కు విస్తృత ఏర్పాట్లు – భ‌క్తుల సౌక‌ర్యాల‌కు పెద్ద పీట‌

తిరుమల, 2019 సెప్టెంబ‌రు 22: తిరుమ‌ల శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాలు సెప్టెంబ‌రు 30 నుండి అక్టోబ‌రు 8వ తేదీ వ‌ర‌కు అంగ‌రంగ వైభవంగా నిర్వ‌హించేందుకు టిటిడి విస్తృత ఏర్పాట్లు చేస్తున్న‌ది.

టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ ఆదేశాల మేర‌కు తిరుమ‌ల ప్ర‌త్యేకాధికారి శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి ఆధ్వ‌ర్యంలో భ‌క్తులంద‌రికి ఎలాంటి ఇబ్బంది లేకుండా శ్రీ‌వారి వాహ‌న సేవ‌ల‌తో పాటు మూల‌విరాట్ ద‌ర్శ‌నం క‌ల్పించేందుకు టిటిడిలోని అన్ని విభాగాలు స‌మ‌న్వ‌యంతో బ్ర‌హ్మోత్స‌వాల ఏర్పాట్లు వేగ‌వంతంగా పూర్తి చేస్తున్నాయి.

బ్రహ్మోత్సవాలకు విస్తృతంగా ప్రచారం-

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు భక్తులను ఆహ్వానించేందుకు టిటిడి విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ఇందుకోసం 12 వేల గోడపత్రికలు, ఒక లక్ష పాంప్లెట్లు, 4,500 బుక్‌లెట్లల‌ను అన్ని ప్రాంతాల భక్తులకు అర్థమయ్యేలా తెలుగు, తమిళం, కన్నడ, ఇంగ్లీషు, హిందీ భాషల్లో ముద్రించింది.

వాహనసేవల వివరాలు, ఇతర సమాచారంతో కూడిన పత్రికలను తిరుమల, తిరుపతిలోని సమాచార కేంద్రాలు (మే ఐ హెల్ప్‌ యు కౌంటర్లు) సర్వదర్శనం కౌంటర్ల ద్వారా భక్తులకు పంపిణీ జరుగుతోంది. దేశవ్యాప్తంగా గల టిటిడి కల్యాణమండపాలు, సమాచార కేంద్రాల్లో గోడపత్రికలను అంటించి భక్తులకు సమాచారం తెలియజేసేందుకు చ‌ర్య‌లు తీసుకున్నారు. తిరుమల-తిరుపతి బస్సులతోపాటు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుండి తిరుపతికి రాకపోకలు సాగిస్తున్న బస్సులకు గోడపత్రికలు అంటించారు. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరి రాష్ట్రాల ఆర్‌టిసి, పర్యాటక శాఖ అధికారులకు ప్రచార సామగ్రిని అందించారు. ఆయా రాష్ట్రాల ఆర్‌టిసి బస్సులకు అంటించడంతోపాటు ప్రముఖ పుణ్యక్షేత్రాలు, ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో గోడపత్రికల ద్వారా ప్రచారం చేస్తున్నారు. టిటిడి ప్రజాసంబంధాల విభాగం సిబ్బంది ఆర్‌టిసి అధికారులతో సమన్వయం చేసుకుని శ్రీవారి సేవకుల సహకారంతో వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సులకు గోడపత్రికలను అంటిస్తున్నారు.

టిటిడి ఇంజినీరింగ్ విభాగం-

టిటిడి ఇంజినీరింగ్ విభాగం ఆధ్వ‌ర్యంలో ఆల‌య నాలుగు మాడ వీధుల‌లో భ‌క్తుల‌ను ఆక‌ట్టుకునేలా రంగ‌వ‌ల్లులు తీర్చిదిద్దుతున్నారు. గ్యాల‌రీల‌లో వేచివుండి భ‌క్తుల సౌక‌ర్యార్థం తాగునీటి కొలాయిలు, మ‌రుగుదొడ్ల మ‌ర‌మ్మ‌త్తులు పూర్తి చేశారు. భ‌క్తులు మాడ వీధుల్లోని గ్యాలరీల‌ల్లోకి ప్రవేశించేందుకు, తిరిగి వెళ్లేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బారీకేడ్లు, క్యూలైన్ల గేట్లు పటిష్టంగా ఏర్పాటు చేశారు. స్వామి పుష్క‌రిణి చుట్టు నూత‌నంగా రాతి స్తంభాల మ‌ధ్య ఏర్పాటు చేస్తున్న ఇత్త‌డి గ్రీల్స్ భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటున్నాయి. తిరుమ‌ల‌లోని ర‌హ‌దారులు, రెండు ఘాట్ రోడ్ల‌కు మ‌ర‌మ్మ‌త్తులు, రోడ్ల‌కు ఇరువైపులా ట్రాఫిక్ నిబంధ‌న‌లు తెలిపే పెయింటింగ్ ప‌నులు పూర్తి చేశారు. తిరుమ‌ల, తిరుప‌తిలోని అలిపిరి వ‌ద్ద అద‌నంగా వాహ‌నాల పార్కింగ్ స్థ‌లం అభివృద్ధి, తాత్కాలిక మ‌రుగుదొడ్లు ఏర్పాటు చేస్తున్నారు.

ఎల‌క్ట్రిక‌ల్ విభాగం ఆధ్వ‌ర్యంలో రంగురంగుల ఆక‌ర్ష‌ణీయ‌మైన ఎల్ఇడి లైట్ల‌తో చేసిన తోర‌ణాల‌ను తిరుమ‌ల, తిరుప‌తి ర‌హ‌దారుల వెంబ‌డి, డివైడ‌ర్ల మ‌ధ్య చెట్ల‌కు అందంగా అలంక‌రించారు. అదేవిధంగా ప్ర‌ధాన కూడ‌ళ్ళ‌లో, ర‌ద్దీ ప్రాంతాల‌లో ఏర్పాటు చేసిన భారీ విద్యుత్ క‌టౌట్లు భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటున్నాయి. అదేవిధంగా భ‌క్తులు వాహనసేవలు తిలకించేందుకు 37 డిస్‌ప్లే స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. రేడియో, బ్రాడ్‌కాస్టింగ్‌ విభాగం ద్వారా ఎప్పటికప్పుడు భక్తులకు ప్రకటనలు తేలిపేందుకు ఏర్పాట్లు చేపట్టారు.

తిరుమ‌ల పాపానాశ‌నం రోడ్డులోని క‌ల్యాణ వేదిక వ‌ద్ద భక్తులను ఆకట్టుకునేలా ఫలపుష్ప, మ్యూజియం, ఫొటో, ఆయుర్వేద, శిల్ప ప్రదర్శనశాలలను ఏర్పాటు చేస్తున్నారు. టిటిడి గార్డెన్‌, అట‌వీ విభాగాల ఆధ్వ‌ర్యంలో శ్రీ‌వారి ఆల‌యం వెలుప‌ల‌, తిరుమ‌ల‌లోని ప్ర‌ధాన కూడ‌ళ్ల వ‌ద్ద భ‌క్తుల‌కు మ‌రింత అహ్లాదం క‌లిగించేలా రంగురంగుల పూల మొక్క‌లు ఏర్పాటు చేస్తున్నారు. టిటిడి హిందూ ధ‌ర్మ ప్ర‌చార ప‌రిష‌త్, ఇత‌ర ప్రాజెక్టుల ఆధ్వ‌ర్యంలో భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ర్షించేలా దేశంలోని వివిద రాష్ట్రాల‌కు చెందిన ప్ర‌ముఖ క‌ళా బృందాలు క‌ళా ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇచ్చేందుకు ఏర్పాట్లు పూర్త‌య్యాయి.

బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండాటిటిడి విజిలెన్స్ విభాగం పోలీసు శాఖ‌తో సమన్వయం చేసుకుని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం దాదాపు 4,700 మంది భ‌ద్ర‌తా సిబ్బంది, 1500 సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. అక్టోబ‌రు 4వ తేదీ గ‌రుడ‌సేవ సంద‌ర్భంగా అక్టోబ‌రు 3వ తేదీ అర్ధ‌రాత్రి నుండి అక్టోబ‌రు 5వ తేదీ ఉద‌యం 6.00 గంట‌ల వ‌ర‌కు తిరుమ‌ల ఘాట్‌రోడ్ల‌లో ద్విచ‌క్ర వాహ‌నాల వాహ‌నాల రాక‌పోక‌ల‌ను ర‌ద్దు చేయ‌డ‌మైన‌ది.

అంతేగాక శ్రీ‌వారి ఆల‌యం, పోటు, అన్న‌ప్ర‌సాద విభాగం, వ‌స‌తి, క‌ల్యాణ‌క‌ట్ట‌, వైద్య‌, ఆరోగ్య, ప్ర‌జాసంబంధాల విభాగాలు అద‌న‌పు సిబ్బందిని ఏర్పాటు చేసుకుని ప్ర‌ణాళిక బ‌ద్దంగా బ్ర‌హ్మోత్స‌వాల‌లో భ‌క్తుల‌కు సేవ‌లందించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.