PRIORITY TO COMMON DEVOTEES- TTD CHAIRMAN _ సామాన్య భ‌క్తుల‌కే ప్రాధాన్యం- ఛైర్మ‌న్ శ్రీ భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి

  • FOUNDATION STONE LAID FOR ACHYUTAM AND SRIPATHAM REST HOUSES

Tirupati, 29 December 2023: TTD aimed at providing affordable accommodation to devotees coming from across the country by constructing more rest houses.

 

On Friday morning TTD Chairman Sri Bhumana Karunakara Reddy laid the foundation stone for l Achyutam and Sripatham rest houses in place of old Choultries ( Sri Govindarajaswami-2 and Sri Kodandaramaswami – 3 ).

 

Speaking on the occasion the TTD board chief said with the objective of common devotees’ comforts in Srivari Darshan, Anna Prasadam and accommodation TTD  launched projects to modernise  aged choultries

 

The 70-year-old second Choultry of Sri Govindarajaswami at 208 crore and 3rd Choultry of Sri Kodandarama Swamy at  209 crores to accommodate 8200 devotees (4100 each) and parking for over 200 cars etc.

 

Each block will have eight floors building totalling 7.04 lakh SFT area with reception, SSD counters, toilets for men and women, two restaurants, five halls for Srivari Sevakulu and store room on the first floor.

 

Second and Third floors will have Anna Prasadam halls and 23 dormitories for 500 devotees each and general toilets. On the fourth floor to eighth floor 8 family suits,100 rooms totalling 540 rooms to be completed within three years.

 

Tirupati Mayor Dr Shirisha, Dy Mayor Sri Abhinay Reddy, JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam, CVSO Sri Narasimha Kishore, CE Sri Nageswara Rao, SE electrical Sri Venkateswarlu, EE Sri Venugopal and others were present.

 

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

సామాన్య భ‌క్తుల‌కే ప్రాధాన్యం

– అచ్యుతం, శ్రీ‌ప‌థం బ్లాక్‌ల నిర్మాణానికి శంకుస్థాప‌న‌

– ఛైర్మ‌న్ శ్రీ భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి

తిరుప‌తి, 2023 డిసెంబ‌రు 29: తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నార్థం ప్ర‌పంచం న‌లుమూల‌ల నుండి విచ్చేసే వేలాది మంది భ‌క్తుల‌కు తిరుప‌తిలో మ‌రింత సౌక‌ర్య‌వంతంగా వ‌స‌తి క‌ల్పించేందుకు టీటీడీ అచ్యుతం, శ్రీ‌ప‌థం వ‌స‌తి స‌మూదాయాలు నిర్మిస్తున్న‌ట్లు టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకర రెడ్డి చెప్పారు. తిరుపతిలోని శ్రీ గోవింద‌రాజ‌స్వామి(రెండు), శ్రీ కోదండ‌రామస్వామి(మూడు) సత్రాల స్థానంలో అచ్యుతం, శ్రీపథం వసతి సముదాయాల నిర్మాణానికి టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకర రెడ్డి ఈవో శ్రీ‌ ఎవి ధర్మారెడ్డి తో కలసి శుక్రవారం శంఖుస్థాపన చేశారు.

ఈ సందర్బంగా చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ, సామాన్య‌ భ‌క్తుల‌కు ప్రాధాన్యం ఇస్తూ ఎలాంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా శ్రీ‌వారి ద‌ర్శ‌నం, అన్నప్ర‌సాదం, బ‌స త‌దిత‌ర సౌక‌ర్యాలు క‌ల్పిస్తున్నామ‌న్నారు. భ‌క్తుల‌కు మ‌రింత మెరుగ్గా బ‌స క‌ల్పించ‌డంలో భాగంగా తిరుమ‌ల‌, తిరుప‌తిలో ఉన్న విశ్రాంతి గృహాల్లో అవ‌స‌ర‌మైన వాటిని ఆధునీక‌రిస్తున్న‌ట్లు తెలిపారు. ఇందులో భాగంగా తిరుపతిలో దాదాపు 70 సంవ‌త్స‌రాల క్రితం నిర్మించిన‌ శ్రీ గోవిందరాజస్వామి సత్రం (రెండో సత్రం) స్థానంలో రూ.209 కోట్ల‌తో అచ్యుతం, శ్రీ కోదండరామస్వామి సత్రం(మూడో సత్రం) స్థానంలో రూ.209 కోట్లతో శ్రీపథం వసతి సముదాయాలు నిర్మించాల‌ని టీటీడీ నిర్ణ‌యించింద‌న్నారు. ఒక్కో బ్లాకులో 4100 మంది చొప్పున మొత్తం 8200 మంది భ‌క్తులు ఇక్క‌డ‌ బ‌స చేసే అవ‌కాశ‌ముంద‌న్నారు. ఇందులో దాదాపు 200కు పైగా కార్లు, ద్విచ‌క్ర‌వాహ‌నాలు పార్కింగ్ చేసుకునే అవ‌కాశం ఉంద‌ని చెప్పారు.

ఒక్కో బ్లాక్‌ను 7.04 ల‌క్ష‌ల చ‌ద‌ర‌పు అడుగు విస్తీర్ణంలో ఎనిమిది ఫ్లోర్ల‌తో నిర్మిస్తామ‌న్నారు. మొద‌టి ఫ్లోర్‌లో రిసెప్ష‌న్‌, ఎస్ఎస్‌డి టోకెన్ కౌంట‌ర్లు, మ‌హిళ‌ల‌కు, పురుషుల‌కు వేరువేరుగా జ‌న‌ర‌ల్ టాయిలెట్లు, మెడిక‌ల్ డిస్పెన్స‌రీ, కార్యాల‌య గ‌దులు, రెండు రెస్టారెంట్లు, శ్రీ‌వారి సేవ‌కుల కోసం ఐదు హాళ్లు, స్టోర్ రూమ్ ఉంటాయ‌న్నారు. రెండు, మూడు ఫ్లోర్ల‌లో అన్నప్ర‌సాదం హాలు, 500 మంది యాత్రికులు బ‌స చేసేందుకు వీలుగా 23 డార్మిట‌రీ హాళ్లు, జ‌న‌ర‌ల్ టాయిలెట్లు నిర్మించ‌నున్న‌ట్లు తెలిపారు. నాలుగో ఫ్లోర్ నుండి ఎనిమిదో ఫ్లోర్ వ‌ర‌కు ఒక్కో ఫ్లోర్‌లో 8 ఫ్యామిలీ సూట్ రూమ్‌లు, 100 గ‌దులు, మొత్తం 540 గ‌దులు ఉంటాయ‌ని చెప్పారు. వీటిని మూడు సంవ‌త్స‌రాల కాల వ్య‌వ‌ధిలో ఈ నిర్మాణాల‌ను పూర్తి చేస్తామ‌ని ఛైర్మ‌న్ వివ‌రించారు.

ఈ కార్యక్రమంలో మేయర్ డాక్టర్ శిరీష, డెప్యూటీ మేయ‌ర్ శ్రీ అభిన‌య్ రెడ్డి, జేఈవోలు శ్రీ‌మ‌తి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో నరసింహ కిషోర్, సిఈ నాగేశ్వరరావు, ఎస్ఈ (ఎల‌క్టిక‌ల్‌) శ్రీ వెంక‌టేశ్వ‌ర్లు, ఈఈ శ్రీ వేణుగోపాల్, త‌దిత‌రులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.