PRIVILEGE DARSHANS IN DECEMBER _ డిసెంబరులో వృద్ధులు, దివ్యాంగులకు, చంటిపిల్లల తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం
Tirumala, 10 Dec. 19: The senior citizens and physically challenged pilgrims could avail darshan in three slots on December 17.
While the darshan for parents with children below five years of age will have darshan through Supatham on December 11 and 18 between 9am and 1.30pm.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
డిసెంబరులో వృద్ధులు, దివ్యాంగులకు, చంటిపిల్లల తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం
డిసెంబరు 10, తిరుమల, 2019: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనం ఎక్కువ మంది వయో వృద్ధులు, దివ్యాంగులకు, 5 సంవత్సరాలలోపు చంటి పిల్లలకు, వారి తల్లిదండ్రులకు కల్పించాలన్న ఉన్నతాశయంతో టిటిడి ప్రతి నెలా రెండు సామాన్య రోజుల్లో వీరికి ప్రత్యేక దర్శనాలను కల్పిస్తోంది.
ఇందులో భాగంగా 5 సంవత్సరాలలోపు చంటి పిల్లలను, వారి తల్లిదండ్రులను డిసెంబరు 11, 18వ తేదీల్లో ఉదయం 9.00 నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు సుపథం ద్వారా దర్శనానికి అనుమతిస్తారు. సాధారణ రోజుల్లో ఒక సంవత్సరం లోపు చంటిపిల్లలకు, వారి తల్లిదండ్రులకు సుపథం మార్గం ద్వారా ప్రవేశం కల్పిస్తారు. భక్తుల కోరిక మేరకు ఐదేళ్లలోపు చంటిపిల్లలను, వారి తల్లిదండ్రులను ఈ రెండు రోజుల్లో సుపథం మార్గం ద్వారా అనుమతిస్తారు.
అదేవిధంగా, డిసెంబరు 17వ తేదీన వయోవృద్ధులు(65 సం|| పైబడినవారు), దివ్యాంగులకు 4 వేల టోకెన్లను టిటిడి జారీ చేయనుంది. ఉదయం 10 గంటల స్లాట్‌కు వెయ్యి, మధ్యాహ్నం 2 గంటలకు 2 వేల టోకెన్లు, 3.00 గంటల స్లాట్‌కు వెయ్యి టోకెన్లు జారీ చేస్తారు. వృద్ధులు, దివ్యాంగులకు ప్రతిరోజూ ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక క్యూలైన్ ద్వారా స్వామివారి దర్శనం కల్పిస్తున్న విషయం విదితమే. భక్తుల కోరిక మేరకు మరింత మందికి స్వామివారి దర్శనం కల్పించేందుకు నెలలో రెండు రోజులపాటు టిటిడి అదనంగా దర్శన టోకెన్లు జారీ చేస్తోంది. వృద్ధులు, దివ్యాంగులు రద్దీ రోజుల్లో తిరుమలకు వచ్చి ఇబ్బందులు పడకుండా, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టిటిడి కోరుతోంది.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.