PRIVILEGED DARSHAN ON NOV 21 AND 22_ నవంబరు 21న వృద్ధులు, దివ్యాంగులకు, 22న చంటిపిల్లల తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం

Tirumala, 20 November 2017: With an aim to provide darshan to more number of aged, physically challenged and parents with small children below five years, TTD has been providing them special privilege darshan on any two lean days every month since August.

This month also, under the instructions of TTD EO Sri Anil Kumar Singhal, TTD has provided darshan to senior citizens who have crossed 65years and physically challenged on November 14. They will be provided darshan on November 21 also. TTD will issue 4000 tickets in three slots with 1000 by 10am, 2000 by 2pm and another 1000 by 3pm.

Similarly, the privilege darshan for parents with children aged below five years was given on November 15 and in second phase they will be given darshan on November 22 from 9am till 1:30pm through Supatham entry.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs,TIRUPATI

నవంబరు 21న వృద్ధులు, దివ్యాంగులకు, 22న చంటిపిల్లల తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం

తిరుమల, 2017 నవంబరు 20: ఎక్కువ మంది వయో వృద్ధులు, దివ్యాంగులకు, 5 సంవత్సరాలలోపు చంటి పిల్లలకు, వారి తల్లిదండ్రులకు శ్రీవారి దర్శనం కల్పించాలన్న ఉన్నతాశయంతో టిటిడి ప్రతి నెలా రెండు సామాన్య దినాలలో వీరికి ప్రత్యేక దర్శనాలను కల్పిస్తోంది.

ఇందులో భాగంగా నవంబరు 21వ తేదీన వయోవృద్ధులు(65 సం|| పైబడినవారు), దివ్యాంగులకు 4 వేల టోకెన్లను టిటిడి జారీ చేయనుంది. ఉదయం 10 గంటల స్లాట్‌కు వెయ్యి, మధ్యాహ్నం 2 గంటలకు 2 వేల టోకెన్లు, 3.00 గంటల స్లాట్‌కు వెయ్యి టోకెన్లు జారీ చేయనున్నారు.

5 సంవత్సరాలలోపు చంటి పిల్లలను, వారి తల్లిదండ్రులను నవంబరు 22న ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు సుపథం ద్వారా దర్శనానికి అనుమతిస్తారు.

ఈ నెలలో ఇప్పటికే నవంబరు 14న వయోవృద్ధులు, దివ్యాంగులకు, నవంబరు 15న 5 సంవత్సరాలలోపు చంటి పిల్లలకు, వారి తల్లిదండ్రులకు శ్రీవారి దర్శనం కల్పించిన విషయం తెలిసిందే.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.