PRIYA SISTERS MAGICAL VOICE ALLURES THE AUDIENCE _ పుర ప్రజలను విశేషంగా ఆకట్టుకున్న ప్రియా సిస్టర్స్ గాత్ర సంగీతం

TIRUPATI, 24 MAY 2024: The melodious notes emanated from the golden voices of the renowned Carnatic music sisters duo, the Priya Sisters touched the artistic souls of audience with their unique Sankeertans.

Shanmukha Priya and Hari Priya with their supporting instrumental artists presented before the audience a galaxy of new songs penned by Saint Poet Sri Tallapaka Annamacharya on the occasion of the 616th Jayanti fete of Annamacharya held at Annamacharya Kalamandiram in Tirupati on Friday evening.

JEO for Health and Education Smt  Goutami felicitated the artists, Annamacharya successors and released a couple of books penned by Prof. Sarvottama Rao on the occasion.

She said the richness of Annamacharya Sankeertans lies in its dialect that which could easily reach every common man. That is why even after six centuries, Annamacharya Sankeertans are admired by every one and it is nice to note that Priya Sisters have acquainted us with a new set of Annamacharya Sankeertans today, she added.

While the sisters duo rendered impeccable Sankeertans like 

Melukonave Neelamegha Varnuda

Aṇurēṇu paripūrṇamainā rūpamu…

Vāḍala vāḍala veṇṭa vasantamu…

Matsya kūrma varāha manuṣya Simha vāmanā ichcharāma rāma rāma hita bud’dhi kalki 

Kalige nidē nāku kaivalyamu…

Ō pavanātmaja ō ghanuḍā…

and many more mesmerizing the denizens.

Annamacharya Project Director Dr Vibhishana Sharma, SVETA and Vengamamba project Director Sri Subramanyam Reddy, VGO Sri Bali Reddy, large number of music lovers were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

పుర ప్రజలను విశేషంగా ఆకట్టుకున్న ప్రియా సిస్టర్స్ గాత్ర సంగీతం

తిరుపతి, 2024 మే 24: ప్రఖ్యాత కర్ణాటక సంగీత సోదరీమణులు ప్రియా సిస్టర్స్ గాత్రముల నుండి వెలువడిన సుమధురమైన స్వరాలతో కూడిన అన్నమయ్య సంకీర్తనలతో తిరుపతి పురప్రజలు తన్మయత్వం చెందారు.

తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో అన్నమాచార్య 616వ జయంతి ఉత్సవాల సందర్భంగా శుక్రవారం సాయంత్రం శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు రచించిన గీతాలలో కొత్త వాటిని షణ్ముఖప్రియ, హరిప్రియలు తమ వాయిద్య బృందంతో కలిసి సుమధురంగా ఆలపించారు.

ఈ సందర్భంగా కళాకారులను, అన్నమాచార్య వంశీయులను టీటీడీ జేఈవో(ఆరోగ్య మరియు విద్య) శ్రీమతి గౌతమి సత్కరించి, డాక్టర్. సర్వోత్తమరావు రచించిన రెండు పుస్తకాలను జేఈవో విడుదల చేశారు.

అనంతరం జేఈఓ మాట్లాడుతూ, అన్నమాచార్య సంకీర్తనల పదాలు సామాన్యుడికి కూడా అర్థం అయ్యేలా పదకవితా పితామహుడు రచించారని అన్నారు. అందుకే ఆరు శతాబ్దాల తర్వాత కూడా అన్నమాచార్య సంకీర్తనలను ప్రతి ఒక్కరూ ఆదరిస్తున్నారాన్నారు. ప్రియా సిస్టర్స్ తమ గాత్ర మాధుర్యం తో అన్నమాచార్య సంకీర్తనలలో కొత్త వాటిని మనకు పరిచయం చేయడం ఆనందంగా ఉందని ఆమె తెలిపారు.

ఇందులో భాగంగా ప్రియా సిస్టర్స్ ఆలపించిన “మేలుకొనవే నీలామేఘవర్ణుడా…, అణురేణు పరిపూర్ణమైనా రూపము…, వాడల వాడల వెంట వసంతము…, నాకున్ చెప్పారే వలపు నలుపో తెలుపో…, నీవు దేవుడవు నేనొక జీవుడ…, కంటిమయ్య నీ చేతలు కన్నుల పండువగాను…, మత్స్య కూర్మ వరాహ మనుష్య సింహ వామనా ఇచ్చరామ రామ రామ హిత బుద్ధి కల్కి …., నీ లాస్య మొక్కటే నిలిచెనమ్మ జలధి…, కలిగె నిదే నాకు కైవల్యము…, ఓ పవనాత్మజ ఓ ఘనుడా…..” వంటి కీర్తనలు ఆహుతులను మంత్రముగ్ధులను చేశాయి.

ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ విభీషణ శర్మ, శ్వేత మరియు వెంగమాంబ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ సుబ్రమణ్యం రెడ్డి, విజిఓ శ్రీ బాలి రెడ్డి, పెద్ద సంఖ్యలో సంగీత ప్రియులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.