PROCESSION OF GARUDA VAHANAM _ తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ

Processional deity of Lord Malayappaswamy is taken out in a procession atop GARUDA VAHANAM around four mada streets at Tirumala on Monday evening in connection with Pournami.

తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ

తిరుమల, జూలై 22, 2013: తిరుమలలో సోమవారం రాత్రి పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరుగనుంది.  ఈ సందర్భంగా రాత్రి 7.00 నుండి రాత్రి 9.00 గంటల నడుమ సర్వాలంకారభూషితుడైన శ్రీ మలయప్పస్వామి తనకు అత్యంత ప్రియమైన గరుడ వాహనాన్ని అధిరోహించి ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించనున్నారు. సోమవారం నాడు గురుపౌర్ణమి కూడా కావడం విశేషం. ఈ నేపథ్యంలో విశేష సంఖ్యలో భక్తులు ఈ వాహనసేవలో పాల్గొననున్నారు.

ఈ కార్యక్రమంలో తితిదే ఉన్నతాధికారులు పాల్గొంటారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.