PROCESSION OF SWARNA RATHAM HELD _ స్వర్ణరథంపై కాంతులీనిన శ్రీ కల్యాణ వేంకటేశ్వరుడు
TIRUPATI, 11 MAY 2023: As part of the ongoing annual Vasanthotsavams at Srinivasa Mangapuram, the procession of Swarna Ratham was held in the evening on Thursday.
In the afternoon the utsava deities were rendered Snapana Tirumanjanam.
Special Grade DyEO Smt Varalakshmi and other officials, archakas, devotees participated.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
స్వర్ణరథంపై కాంతులీనిన శ్రీ కల్యాణ వేంకటేశ్వరుడు
తిరుపతి, 2023 మే 11: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక వసంతోత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం స్వామివారి స్వర్ణరథోత్సవం కన్నులపండుగగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం శ్రీవారి ఉత్సవర్లను వసంత మండపానికి వేంచేపు చేసి ఆస్థానం చేపట్టారు. మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు స్వర్ణరథంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఈఈ 2 శ్రీ ప్రసాద్, ఎఈవో శ్రీ గురుమూర్తి, సూపరింటెండెంట్ శ్రీ చెంగల్రాయులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.