PROGRAMS ENTHRALLS _ నాదనీరాజనం వేదికపై ఆకట్టుకున్న ధార్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు
Tirumala, 2 Oct. 19 : The devotional cultural programmes in Tirumala enthralled the devotees on Wednesday.
Began with Nadaswaram, the Dharmikopanyasam by Smt Chudamani from Hyderabad, Annamaiah Vinnapalu by Smt Susheela and her team from Chennai, vocal by Smt Ragini Sanat of Bengaluru during Unjal Seva, Harikatha by Bhagavatarini Nagarathnamma mused pilgrims.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
2019 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
నాదనీరాజనం వేదికపై ఆకట్టుకున్న ధార్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు
అక్టోబరు 01, తిరుమల, 2019: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం తిరుమలలోని నాదనీరాజనం వేదికపై ధార్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టు, శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల ఆధ్వర్యంలో తిరుమలలోని నాదనీరాజనం వేదిక, ఆస్థానమండపంలో ధార్మిక, ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు ఏర్పాటుచేశారు.
ఇందులో భాగంగా నాదనీరాజనం వేదికపై ఉదయం 5 నుండి 5.30 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీ ఎస్.మునిరత్నం బృందం మంగళధ్వని, ఉదయం 5.30 నుండి 6.30 గంటల వరకు తిరుమల ధర్మగిరి వేదపాఠశాల విద్యార్థులు చతుర్వేద పారాయణం నిర్వహించారు. ఉదయం 6.30 నుండి 7 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీమతి ఎం.మీనాక్షి బృందం విష్ణుసహస్రనామ పారాయణం, ఉదయం 7 నుండి 8.30 గంటల వరకు హైదరాబాద్‌కు చెందిన డా.టి.కె.చూడామణి ధార్మికోపన్యాసం చేశారు.
మధ్యాహ్నం 3 నుండి 4.30 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీమతి ఆర్.సుశీల బృందం అన్నమయ్య విన్నపాలు, సాయంత్రం 4.30 నుంచి 5.30 గంటల వరకు చెన్నైకి చెందిన శ్రీ ఆర్.నాగరాజన్ బృందం నామసంకీర్తన, సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు ఊంజల్‌సేవలో బెంగుళూరుకు చెందిన శ్రీమతి రాగిణి సనత్ బృందం అన్నమాచార్య సంకీర్తనలను వీనులవిందుగా గానం చేశారు. రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీమతి వి.నాగత్నమ్మ భాగవతారిణి హరికథ పారాయణం చేశారు.
అదేవిధంగా, తిరుమలలోని ఆస్థానమండపంలో బుధవారం ఉదయం 11.30 నుండి 12.30 గంటల వరకు కడపకు చెందిన శ్రీమతి మల్లెల శశికళ బృందం భక్తి సంగీత కార్యక్రమం నిర్వహించారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.