PROTECTION OF DESI COWS IS OUR PRIMARY AIM- TTD EO_ గో సంరంక్షణకు దాతాలు విరివిగా విరాళాలు అందించాలి : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

Tirupati, 16 January 2018: Protection and promotion of the progeny of Desi breeds is the primary aim of TTD, said Executive Officer Sri Anil Kumar Singhal.

Speaking on the occasion of Gopuja held at SV Gosala in Tirupati on Tuesday, the EO told media persons that the Gosamrakshana Trust of TTD has been established with a motto to protect desi breeds.

“Today we have nearly 100crores in the trust in the form of donations. Every year as a part of Hindu Dharma Prachara we have been spending Rs.8crores on cow protection. We are giving financial aid to private dairy farms also. Under the instructions of Honourable CM of AP Sri N Chandrababu Naidu We are also bringing awareness among dairy farmers on traditional farming technique like using Panchagavya products in organic farming etc.”, he added.

The EO also informed that donors are keen to promote Gosamrakshana. On December 26last, a donor has donated Rs11.11cr to SV Gosamrakshana Trust. TTD is framing guidelines to promote Gosamrakshana in future. We have included agriculture, animal husbandry, Go Samrakshana Trust officials to come out with concrete action plan”, he maintained.

Tirupati JEO Sri P Bhaskar, Dairy Farm Director Dr Harnath Reddy were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

గోవులను రక్షించుకుందాం.. సంస్కృతిని కాపాడుకుందాం

గో సంరంక్షణకు దాతాలు విరివిగా విరాళాలు అందించాలి : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

తిరుపతి, 2018 జనవరి 16: వేదాలు, పురాణాల్లో పేర్కొన్న విధంగా సకల దేవతాస్వరూపాలైన గోవులను రక్షించుకోవడం ద్వారా సనాతన భారతీయ హైందవ సంస్కృతిని కాపాడుకుందామని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌
సింఘాల్‌ ””ఉద్ఘాటించారు. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో మంగళవారం కనుమ పండుగ సందర్బంగా గో మహోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి.

ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ మాట్లాడుతు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు గోవు గొప్పతనాన్ని భావితరాలకు అందించేందుకు గోపూజ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టినట్టు తెలిపారు. పూర్వకాలం నుండి కనుమ పండుగ రోజున గోపూజకు చాల ప్రాదాన్యత ఉందన్నారు. గోవును పూజించడం
వలన పాడిపంటలు పుష్కలంగా పండి లోకం సుభిక్షంగా వుంటుందని తెలిపారు. తిరుపతి, పలమనేరులోని గోశాలలో 3000 పశువులు ఉన్నాయని, వీటిలో పలు అరుదైన జాతుల గోవులు ఉన్నాయని వివరించారు.

ఇప్పటి వరకు దాతాలు రూ.100 కోట్లకు పైగా ”ఎస్వీ గో సంరక్షణట్రస్టు” విరాళాలు అందించినట్లు తెలిపారు. దేశవాళీ గోవులను అభివృద్ధి చేయాలని, వాటి పంచగవ్యఉత్పత్తుల ప్రాముఖ్యతను ప్రజలకు తెలిపేందుకు టిటిడి కృషి చేస్తుందన్నారు. పంచగవ్య ఉత్పత్తుల ద్వారా రైతులు ఖర్చులు తగ్గించుకుని ఆదాయం పెంచుకోవాలన్నారు. భూమికి హని చేసే రసాయన ఏరువుల వాడకం తగ్గించి
సేంద్రియ ఎరువులు ఉపయోగించాలన్నారు. ప్రభుత్వ సహకారంతో గో సంపదను కాపాడేందుకు విస్తృత కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఆనంతరం టిటిడి తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పోలా భాస్కర్‌ మాట్లాడుతూ హైందవ సంప్రదాయంలో గోవును పూజిస్తే సకల దేవతల పూజాఫలం లభిస్తుందని తెలిపారు. ఆవు
నుండి లభించే పంచగవ్యాల్లో ఏన్నో ఔషధ గుణాలున్నాయని తెలియజేశారు. టిటిడి గోశాలల నిర్వహణ ద్వారా గోసంరక్షణ, గో ఆభివృద్ధికి కృషి జరుగుతోందన్నారు. శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణ ట్రస్టు ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వున్న ఆదర్శ గో శాలలకు ఆర్ధిక సాయం అందించేందుకు చర్యలు తిసుకుంటునట్లు ఆయన తెలిపారు.

టిటిడి ప్రాజెక్టుల ప్రత్యేకాధికారి శ్రీ ముక్తేశ్వరరావు మాట్లాడుతూ వేదల నుండి గోమాత ఉద్భవించినందున భారతీయ హైందవ సంప్రదాయంలో గోవులకు విశిష్టమైన స్థానం ఉందన్నారు. గోవు తల్లి లాంటిదని, గోవును పుజిస్తే తల్లిదండ్రులు, గురువును పూజించినట్లని తెలిపారు. గోవు సంతానమైన ఏద్దు పాడిపంటలు పండిచడానికి, రైతులకు అండగా ఉంటుందని వివరించారు.

అంతకుముందు ఈఓ శ్రీ అనిల్‌కుమార్‌ సింగాల్‌ గోశాలలోని శ్రీవేణుగోపాల స్వామి ఆలయంలో పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం గౌరిపూజ, తులసిపూజలో పాల్గొన్నారు.అటుతర్వాత గజరాజు, అశ్వాలు, వృషభాలు, గోవులకు పూజలు చేసి కర్పూర హారతులు సమర్పించి, వాటికి దానా అందించారు.

ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నమయ్య సంకీర్తనల ఆలాపన, దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్వహించిన భజనలు, కోలాటాలు, ఎస్వీ సంగీత నృత్య కళాశాల, విశ్వం టాలెంట్‌ స్కూల్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులు, పురప్రజలను ఆకట్టుకున్నాయి.

ఎస్వీ గోశాల సంచాలకులు డాక్టర్‌ కె.హరనాథరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ కార్యదర్శి శ్రీ రామకృష్ణారెడ్డి, డిఈవో శ్రీ రామచంద్ర, ఇతర అధికార
ప్రముఖులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.