PROTECTION OF SANATANA DHARMA IS THE NEED OF HOUR-HDPP CHIEF_ సనాతన ధర్మంపై బాలబాలికలకు అవగాహన కల్పించాలి : టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ కార్యదర్శి డా||రమణ ప్రసాద్‌

Tirupati, 22 October 2018: The Hindu Dharma Prachara Parishad (HDPP) Secretary, Dr Ramana Prasad said Protection of Sanatana Dharma is the need of hour.

Addressing the second batch training programme of Dharmachryas hailing from Telugu states in SVETA building, the HDPP chief said, the programme is aimed at training Dharmacharyas through which you can train children and youth on the values of Sanatana Dharma, he added.

Communication training expert Smt Gayatri Sridhar impressed the trainers with her speaking skills and active interaction.

Epic Studies special officer Sri Damodar Naidu was also present.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

సనాతన ధర్మంపై బాలబాలికలకు అవగాహన కల్పించాలి : టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ కార్యదర్శి డా||రమణ ప్రసాద్‌

తిరుపతి, 2018 అక్టోబరు 22: భావిభారత పౌరులైన బాలబాలికలకు సనాతన ధర్మంపై అవ‌గాహ‌న క‌ల్పించ‌డం ద్వారా ధ‌ర్మ‌బద్ధ‌మైన స‌మాజాన్ని నిర్మించ‌వ‌చ్చ‌ని టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ కార్యదర్శి డా|| రమణ ప్రసాద్ పేర్కొన్నారు. తిరుపతిలోని శ్వేత భవనంలో సోమ‌వారం రెండో బ్యాచ్ ధ‌ర్మాచార్యుల‌కు శిక్ష‌ణ కార్య‌క్ర‌మం ప్రారంభ‌మైంది.

ఈ సందర్భంగా డా|| రమణ ప్రసాద్ మాట్లాడుతూ టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుపతి జెఈవో శ్రీ పోలా భాస్కర్‌ ఆదేశాల మేరకు వివిధ ప్రాంతాల నుండి ధ‌ర్మాచార్యుల‌ను ఎంపిక చేసి విశిష్ట ధ‌ర్మాచార్యుల చేత శిక్ష‌ణ ఇస్తున్న‌ట్టు తెలిపారు. ఇక్క‌డ శిక్ష‌ణ పొందిన ధ‌ర్మాచార్యులు ఆయా ప్రాంతాల‌కు వెళ్లి విద్యార్థిని విద్యార్థుల‌కు సులభంగా అర్ధమయ్యేలా, చిరకాలం గుర్తుండేలా బోధిస్తార‌ని వివ‌రించారు. ఈ శిక్ష‌ణ‌కు హాజ‌రైనవారంద‌రూ స‌నాత‌న ధ‌ర్మ జ్ఞాన‌జ్యోతిని వ్యాప్తి చేయాల‌ని కోరారు. ఇందులో పుస్త‌క సామ‌గ్రిని అందించ‌డంతోపాటు శిక్ష‌ణ‌, ఆధ్య‌య‌నం, ఆచ‌ర‌ణ ద్వారా లోతుగా అవ‌గాహ‌న క‌లుగుతుంద‌న్నారు.

కాగా, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అన్ని జిల్లాల నుండి 50 మందిని ఈ శిక్ష‌ణ‌కు ఎంపిక చేశారు. ఆరు రోజుల పాటు శిక్ష‌ణ ఇవ్వ‌నున్నారు. శ్రీ‌వేంక‌టేశ్వ‌రుని దివ్య‌చ‌రిత్ర, స‌నాత‌న ధ‌ర్మం, పండుగ‌లు – ప‌ర‌మార్థం, ఆచారాలు – వైజ్ఞానిక దృక్ప‌థం త‌దిత‌ర అంశాల‌పై లోతుగా అవ‌గాహ‌న క‌ల్పిస్తారు. పండిట్ రవిశంకర్‌ ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌లో శిక్షకురాలు అయిన‌ శ్రీమతి గాయత్రి ధర్మప్రచారకులకు బోధ‌నా ప‌ద్ధ‌తులు, విష‌య సేక‌ర‌ణ‌, ఫీడ్‌బ్యాక్ సేక‌ర‌ణ త‌దిత‌ర అంశాల‌పై శిక్ష‌ణ ఇస్తున్నారు.

ఈ కార్యక్రమంలో ఎపిక్ స్ట‌డీస్ ప్ర‌త్యేకాధికారి ఆచార్య దామోద‌ర‌నాయుడు, హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ సిబ్బంది పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.