PROVIDE FEEDBACK TO IMPROVE THE PILGRIM FACILITIES – ADDITIONAL EO _ శ్రీవారి భక్తులకు అత్యంత భక్తి శ్రద్ధలతో సేవలు అందించండి – అదనపు ఈవో

Tirumala, 25 September 2024: The srivari sevaks besides offering services to the multitude of visiting pilgrims with utmost discipline, dedication and devotion, should also provide feedback for improving the facilities to devotees said TTD Additional EO Sri Ch Venkaiah Chowdhary.

Addressing the Srivari Sevaks hailing from AP, TS, TN, Karnataka, and Maharashtra during the Satsang program held at Seva Sadan 2 in Tirumala on Wednesday evening, he said, the Srivari Sevaks should make use of the divine opportunity by offering the best possible services to the multitude of visiting pilgrims at Tirumala.

He also asked them to observe the happenings at their service points and give their feedback which plays a vital role for improving the facilities to devotees.

He said the online registration of Srivari Seva as well the allotment of temple duty through electronic dip systems are being carried out in a transparent manner and later he released the temple duty through the e-dip system in front of Srivari Sevaks.

Bhajan and meditation programmes were also held to the devotees.

Chief PRO Dr T Ravi, PRO Kum. P Neelima, Srivari Seva and PR office staff, others were also present.

Earlier, the Additional EO inspected the areas including Sri Padmavati Rest House, new Panchajanyam Kitchen in view of AP CM’s visit on the first day of annual Brahmotsavams on October 4.

CE Sri Satyanarayana, Garden Dy Director Sri Srinivasulu, Dy Director of Forests Sri Srinivas, DyEOs Sri Rajendra, Health Smt Asha Jyothi, Catering Special Officer Sri GLN Shastry, VGO Sri Surendra and others were also present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవారి భక్తులకు అత్యంత భక్తి శ్రద్ధలతో సేవలు అందించండి – అదనపు ఈవో

తిరుమల, 2024 సెప్టెంబ‌రు 25: శ్రీవారి సేవకులు అత్యంత క్రమశిక్షణ, అంకితభావం మరియు భక్తి శ్రద్ధలతో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు సేవలు అందించడమే కాకుండా యాత్రికులకు అందుతున్న వివిధ సేవలపై అభిప్రాయ సేకరణ చేయాలని టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి పిలుపునిచ్చారు..

తిరుమలలోని సేవాసదన్- 2లో బుధవారం సాయంత్రం జరిగిన సత్సంగ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన శ్రీవారి సేవకులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, శ్రీవారి సేవకులు స్వామివారి భక్తులకు సేవలందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. తాము సేవలందించే ప్రాంతాలలో భక్తులకు అందుతున్న సదుపాయాలను గమనించి, వాటిపై అభిప్రాయ సేకరణను చేసి తమకు అందించి, తద్వారా వారికి అందుతున్న సౌకర్యాలు మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించాలని ఆయన కోరారు.

ఆన్‌లైన్‌లో శ్రీవారి సేవ రిజిస్ట్రేషన్‌తోపాటు, ఎలక్ట్రానిక్‌ డిప్‌ సిస్టమ్‌ ద్వారా ఆలయ విధుల కేటాయింపులు ఎంతో పారదర్శకంగా జరుగుతున్నాయని తెలిపారు. అనంతరం శ్రీవారి సేవకులకు ఆయనే స్వయంగా ఈ-డిప్‌ విధానంలో ఆలయ డ్యూటీని విడుదల చేశారు. అంతకుముందు శ్రీవారి సేవకులు కొరకు భజన, ధ్యాన కార్యక్రమాలు జరిగాయి .
ఈ కార్యక్రమంలో చీఫ్ పీఆర్వో డాక్టర్ టీ రవి, పీఆర్వో కుమారి పి.నీలిమ, శ్రీవారి సేవ మరియు ప్రజా సంబంధాల కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అంతకుముందు అక్టోబరు 4న వార్షిక బ్రహ్మోత్సవాల తొలిరోజున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు తిరుమల పర్యటన దృష్ట్యా శ్రీ పద్మావతి విశ్రాంతి గృహం, పాంచజన్యం, తదితర ప్రాంతాలను అదనపు ఈవో సంబంధిత అధికారులతో కూడి పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో సిఈ శ్రీ సత్యనారాయణ, గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు, టిటిడి అటవీ శాఖ ఉపసంచాలకులు శ్రీ శ్రీనివాస్, డిప్యూటీ ఈవోలు శ్రీ రాజేంద్ర, శ్రీమతి ఆశాజ్యోతి, క్యాటరింగ్ ప్రత్యేక అధికారి శ్రీ జీఎల్‌ఎన్ శాస్త్రి, విజిఓ శ్రీ సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.