PROVIDE HIGH STANDARDS OF SECURITY TO HILL TOWN-TTD EO_ టిటిడిలో ఉన్నతమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్
Tirupati, 20 July 2017: Terming that the safety and security of the multitude of visiting pilgrims thronging Tirumala temple is the top most priority of temple management of TTD, the EO Sri Anil Kumar Singhal directed the Vigilance and Security officers of TTD to provide hi-fi security to the Hill town by installing advanced gadgets.
A review meeting on the security aspects of Tirumala was held in the chambers of TTD EO in Tirupati on Thursday. During this meeting the EO instructed the vigilance cops not to compromise on the security front at Srivari Temple, Alipiri and GNC check points, in both the Ghat Roads as well as footpath routes. “Install high quality security gadgets , Facial Recognition devices (CC cameras captures the facial images of faces suspicious persons). Chalk out an action plan to purchase security devices in first phase. Invite an expert team from Noida to check the quality of these security gadgets. Utilise the services of HCL for the usage of these hi-fi security devices in an effective manner”, he said.
Adding further the EO said, in the second phase the security sleuths should be given proper training and orientation over usage and functioning of these gadgets. “Also install more number of CCTVs in Sector 1 and 3. Follow International Airport standards in the installation of CC cameras”, he maintained.
Tirumala JEO Sri KS Sreenivasa Raju, CVSO Sri A Ravikrishna, Additional CVSO Sri Siva Kumar Reddy, VGO Sri Ravindra Reddy, HCL Manage Sri Saikrishnan were also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
టిటిడిలో ఉన్నతమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్
తిరుపతి, 2017 జూలై 20: శ్రీవారి దర్శనార్థం విచ్చేస్తున్న భక్తుల శ్రేయస్సు కోసం ఉన్నతమైన భద్రతా ప్రమాణాలను పాటించాలని టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ భద్రతాధికారులకు సూచించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలో గల ఈవో కార్యాలయంలో గురువారం భద్రతాంశాలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుమల శ్రీవారి ఆలయం, ఘాట్ రోడ్లు, నడకమార్గాలు, తిరుపతిలోని టిటిడి సంస్థల్లో భద్రతాపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన పరికరాలు కొనుగోలు చేయాలని ఆదేశించారు. అలిపిరి చెకింగ్ పాయింట్, అలిపిరి నడకమార్గం, శ్రీవారిమెట్టు నడక మార్గాల్లో ఫేసియల్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్ గల సిసిటివిలను ఏర్పాటుచేసి సంఘవిద్రోహశక్తులు, పాత నేరస్తులను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం ఉన్నవాటిలో ఎన్ని సిసిటివీలను అప్‌గ్రేడ్ చేయాలని, ఎన్నింటిని మార్పు చేయాలనే విషయాలను పరిశీలించాలన్నారు. భద్రతా పరికరాల నాణ్యతను పరిశీలించేందుకు నోయిడా నుంచి భద్రతా నిపుణులను రప్పించాలని, సాంకేతిక పరిజ్ఞానం విషయంలో హెచ్‌సిఎల్ సంస్థ సహకారం తీసుకోవాలని సూచించారు.
తిరుమలలో సిసిటివిలను శ్రీవారి బ్రహ్మూెత్సవాలలోపు ఏర్పాటుచేయాలన్నారు. సిసిటివిలు, ఇతర భద్రతాపరికరాలను సెంట్రల్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేసి భద్రతను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్-1లో డిఎఫ్‌ఎండి(డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్), లగేజి స్కానర్లు తదితర పరికరాలను ఏర్పాచేయాలని ఈవో ఆదేశించారు. నాణ్యతలో రాజీ పడకుండా విమానాశ్రయాలలో పాటిస్తున్న తరహాలో టిటిడిలో భద్రతా వ్యవస్థను అమలు చేయాలని ఆదేశించారు. భద్రతాపరికరాల వినియోగంపై సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వాలన్నారు.
ఈ సమావేశంలో తిరుమల జేఈవో శ్రీ కెఎస్.శ్రీనివాసరాజు, సివిఎస్‌వో శ్రీ ఎ.రవికృష్ణ, అదనపు సివిఎస్‌వో శ్రీ శివకుమార్ రెడ్డి, విజివో శ్రీ రవీంద్రారెడ్డి, హెచ్‌సిఎల్ మేనేజర్ శ్రీ సాయికృష్ణన్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.