PUBLIC AUCTION OF IMMOVABLE PROPERTIES ONLY-TTD CHAIRMAN _ అవన్నీ నిరర్థక ఆస్తులే – భక్తులనుగందరగోళానికి గురిచేయవద్దు : టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి
APPEALS TO DEVOTEES NOT FALL PREY TO THE FALSE MEDIA REPORTS
Tirupati, 23 May 20: Brushing aside the rumours by a section of media, TTD Chairman Sri YV Subba Reddy clarified that TTD has decided to auction 50 immovable properties in AP and Tamil Nadu which are unviable, not useful and prone to encroachment. He also said, that as per Rule 165 of Chapter -XXII issued in GO Ms No.311, Revenue (Endts 1) Department, dated 09-04-1990, the TTD Board is competent to sale, exchange and mortgage the immovable properties, if found beneficial to TTD.
Appealing to devotees not to be carried away by the false reports by a section of media which triggered confusion and hurt the sentiments of the pilgrims, TTD Board Chief said that the practice of selling immovable, non-maintainable and not useful properties is in vogue since 1974. Between 1974-2014, about 129 such immovable properties which are not useful to TTD activities were disposed off in public auction.
He said, a sub-committee was set up for identification of such immovable properties as per Resolution No.84 dated 28-7-2015, during the Board Meeting held under the Chairmanship the then TTD Trust Board Chief Sri Ch. Krishnamurthy. Following the report by the sub-committee comprising of the then board members Sri Bhanu Prakash Reddy, Sri DP Ananta, Sri J Sekhar, Smt Suchitra Ella and Sri Sandra Venkata Veeraiah, the board in its Resolution No.253, dated 30-01-2016 resolved to dispose by public auction of 50 such unviable properties. However, as one piece of land is under legal dispute, TTD is set for the auctioning of 49 immovable properties including 17 in Rural AP, 9 in Urban AP and 23 in Rural TN in consultation with respective Sub-registrar offices with regard to book value and market value of those properties. Apart from this, another piece of land to the extent of 1.20 acres available at Rishikesh is also included for public auction, as the said land is encroached upon by unauthorized people by undertaking illegal constructions, the Chairman maintained.
Subsequently, the present TTD Board has approved only the upset rate for public auction in their Resolution no.309, dated 29-02-2020 for disposal of the said 50 immovable properties worth Rs 23.92 crore through public auction. This is only a continuation of the auctioning process commenced by the previous board only, Sri YV Subba Reddy stressed. He said, the immovable properties which are set for auctioning includes tiny house plots varying between 1 cent and 5 cent while farm lands ranging between 10 cents and below one acre which are non-maintainable and non-revenue generating properties for TTD.
The TTD Trust Board Chief also said that the Government of Andhra Pradesh is no way connected with the disposal of immovable properties of TTD under public auction and it is not correct to link up the decisions of the TTD board with the Government. It is not correct on the part of a section of media, hurting the sentiments of millions of devotees and misguiding them with baseless reports.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
అవన్నీ నిరర్థక ఆస్తులే-
భక్తులనుగందరగోళానికి గురిచేయవద్దు : టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి
తిరుపతి, 2020 మే 23: తిరుమల తిరుపతి దేవస్థానములు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలలో బహిరంగ వేలం ద్వారా విక్రయించడానికి నిర్ణయం తీసుకున్న 50 ఆస్తులు దేవస్థానానికి ఏమాత్రం ఉపయోగపడనివేనని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి తెలిపారు.. కొన్ని టివి ఛానళ్ళలో ఈ విషయానికి సంబంధించి అవాస్తవ సమాచారంతో భక్తుల్లో గందరగోళం ఏర్పడిందనీ, అయితే వాస్తవాలు ఇలా ఉన్నాయని ఆయన తెలిపారు.
జివో ఎంఎస్ నెం.311 రెవెన్యూ (ఎండోమెంట్స్ -1), తేదీ 09 – 04 – 1990 రూల్ -165, చాప్టర్ – 22, ద్వారా టిటిడికి మేలు కలిగే అవకాశం ఉంటే దేవస్థానం ఆస్తులను విక్రయించడం, లీజుకు ఇవ్వడం లాంటి అధికారాలు టిటిడి బోర్డుకే ఉన్నాయని చెప్పారు. అదేవిధంగా బోర్డు నిర్ణయాలకు ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని ఆయన చెప్పారు.
దేవస్థానం నిరర్థక ఆస్తుల అమ్మక ప్రక్రియ 1974 నుండి జరుగుతోందన్నారు. ఈ రకంగా 2014 వరకు 129 ఆస్తులను బహిరంగ వేలము ద్వారా విక్రయించడం జరిగిందన్నారు. ఇదే క్రమంలో శ్రీ చదలవాడ కృష్ణమూర్తి అధ్యక్షులుగా గల పాలకమండలి తీర్మానం నంబరు 84 తేదీ 28 – 07 – 205 మేరకు టిటిడికి ఏరకంగాను ఉపయోగపడని ఆస్తులను గుర్తించి బహిరంగ వేలము ద్వారా వాటిని విక్రయించడానికి గల అవకాశాలను పరిశీలించడానికి ఒక సబ్ కమిటీని నియమించినట్లు చైర్మన్ చెప్పారు. ఈ సబ్ కమిటీలో అప్పటి పాలక మండలి సభ్యులు శ్రీ జి.భాను ప్రకాష్‌రెడ్డి, శ్రీ జె.శేఖర్, శ్రీ డి.పి.అనంత, శ్రీమతి ఎల్లా సుచరిత, శ్రీ సండ్ర వెంకట వీరయ్య లను సభ్యులుగా నియమించారన్నారు.
అప్పటి సబ్ కమిటీ నివేదిక మేరకు , అప్పటి తీర్మానం నెం. 253 తేదీ 30 – 01- 2016 ద్వారా ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశంలోని ఇతర ప్రాంతాలలో సబ్ కమిటీ గుర్తించిన 50 నిరర్థక ఆస్తులను బహిరంగ వేలము ద్వారా విక్రయించడానికి శ్రీ చదలవాడ కృష్ణమూర్తి ఆధ్యక్షతన గల పాలక మండలి ఆమోదం తెలిపినట్లు చెప్పారు..
ఈ తీర్మానం మేరకు దేవస్థానం సిబ్బంది ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతాలలో గల 17 ఆస్తులు, పట్టణ ప్రాంతాలలోని 9 ఆస్తులు, తమిళనాడు రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలలో ఉన్న 23 ఆస్తులకు సంబంధించి సబ్‌రిజిస్టార్ కార్యాలయాల రికార్డులలోని విలువ, బహిరంగ మార్కెట్ విలువలను సేకరించి పాలకమండలికి నివేదించడం జరిగింది. ఒక ఆస్తికి సంబంధించి కోర్టు కేసు ఉండటంతో వేలం ప్రక్రియ నుంచి మినహాయించడం జరిగింది. అలాగే రుషికేష్‌లో ఒక ఎకరా 20 సెంట్ల భూమి వల్ల టిటిడికి ఎలాంటి ఉపయోగం లేకుండా దురాక్రమణకు గురయ్యే ప్రమాదం ఉండటంతో దీన్ని కూడా వేలం జాబితాలో చేర్చినట్లు చెప్పారు.
పై తీర్మానం మేరకు 50 నిరర్థక ఆస్తుల విలువను రూ. 23.92 కోట్లుగా ప్రస్తుత పాలక మండలి తీర్మానం నెం.309 తేదీ 29-02 – 2020 ద్వారా ధర నిర్ణయిస్తూ గత పాలక మండలి నిర్ణయాలను అమలు చేయదానికి ఆమోదం మాత్రమే తెలపడం జరిగిందన్నారు. ఈ ఆస్తులు దేవస్థానానికి ఏవిధంగాను ఉపయోగపడేవి కాదన్నారు. సదరు నిరర్థక ఆస్తులు 1 నుంచి 5 సెంట్ల లోపు ఉన్న ఖాళీ ఇంటి స్థలాలు, 10 సెంట్ల నుంచి ఎకరం లోపు విస్తీర్ణం ఉన్న వ్యవసాయ భూములుగా ఉన్నాయన్నారు. వీటివలన దేవస్థానానికి ఎలాంటి ఆదాయం లేక పోగా, ఆక్రమణలకు గురయ్యే ప్రమాదం ఉన్నందువల్ల ఈ ఆస్తులను బహిరంగ వేలము ద్వారా విక్రయించాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. అయితే కొన్ని ప్రసార సాధనాలు టిటిడి ఆస్తుల వేలం విక్రయానికి సంబంధించి గత పాలక మండలి తీసుకున్న , పై కమిటీలు తీసుకున్న నిర్ణయాలకు , ప్రభుత్వానికి లింకు పెట్టడం సరికాదని వైవి చెప్పారు. వాస్తవాలు ఇలా ఉండగా కొన్ని ప్రసార సాధనాలు అవాస్తవ సమాచారం తో కథనాలు ప్రసారం చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీయడం మంచి పద్ధతి కాదని శ్రీ సుబ్బారెడ్డి చెప్పారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.