PULSE POLIO ADMINISTRATION IN TIRUMALA _ జ‌న‌వ‌రి 19 నుండి 21వ తేదీ వరకు తిరుమలలో పల్స్‌పోలియో

Tirumala, 18 Jan. 20: The three day Pulse Polio drops administration programme will commence at Tirumala on Sunday.

TTD has arranged 25 polio drops administration centres in Tirumala which includes 18 centres for pilgrims and seven for locals.

This programme will be performed from 6am to 5pm during these three days according to TTD Chief Medical Officer Dr Nageswara Rao.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

జ‌న‌వ‌రి 19 నుండి 21వ తేదీ వరకు తిరుమలలో పల్స్‌పోలియో

తిరుమల, 2020 జ‌న‌వ‌రి 18: శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులు, స్థానికుల సౌకర్యార్థం టిటిడి ఆధ్వర్యంలో తిరుమలలో జ‌న‌వ‌రి 19 నుండి 21వ తేది వరకు మూడు రోజుల పాటు పల్స్‌పోలియో కార్యక్రమం జరుగనుంది.

ఇందుకోసం టిటిడి వైద్య విభాగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని ముఖ్య వైద్యాధికారి డా|| నాగేశ్వరరావు    తెలిపారు. ఐదేళ్ల లోపు చిన్నారులకు తప్పక పోలియో చుక్కలు వేయించాలని కోరారు. ఇందుకోసం వైద్యసిబ్బంది, ఎన్‌సిసి క్యాడెట్లు, ఇతర సిబ్బంది సేవలందిస్తారని తెలిపారు.  

ప్రతి రోజూ ఉదయం 6.00 నుండి సాయంత్రం 5.00 గంటల వరకు శిబిరాల్లో పోలియో చుక్కలు వేస్తారు. తిరుమలలో శ్రీవారి ఆలయంలో 1, భక్తుల కోసం వివిధ ప్రాంతాల్లో 18, స్థానికుల కోసం 6 కలిపి మొత్తం 25 శిబిరాలను ఏర్పాటుచేశారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.