PULSE POLIO DROPS ADMINISTRATION COMMENCES IN TIRUMALA _ తిరుమ‌ల‌లో ప‌ల్స్ పోలియో ప్రారంభం

Tirumala, 27 Feb. 22: On the first day of the nation wide three-day pulse polio drops administration program, TTD Chief Medical Officer In-charge Dr Narmada commenced the drive in front of Tirumala temple on Sunday.

TTD has set up 25 centres at different places in Tirumala out of which 21 for pilgrims and four for locals.

This drive will last till March 1. The devotees are requested to make use of the polio drops administration program for their kids aged between 0-5years.

Aswini Hospital Medical Superintendent Dr S Kusuma Kumari, Central Hospital Medical Superintendent Dr B Kusuma Kumari and other nursing staff were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

తిరుమ‌ల‌లో ప‌ల్స్ పోలియో ప్రారంభం

తిరుమ‌ల‌, 2022 ఫిబ్ర‌వ‌రి 27: దేశవ్యాప్త కార్యక్రమంలో భాగంగా తిరుమల శ్రీ‌వారి ఆల‌యం వ‌ద్ద ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభమైంది. టిటిడి ఇన్ ఛార్జి ముఖ్య వైద్యాధికారి డాక్ట‌ర్ ఎబి.న‌ర్మ‌ద పిల్లలకు పోలియో చుక్కలు వేశారు.

తిరుమలలో 25 ప్రాంతాలలో పల్స్‌పోలియో కేద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో శ్రీవారి ఆలయంతో కలిపి 21 ప్రాంతాలలో భక్తులకు, 4 ప్రాంతాలలో స్థానికులకు ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరిగే పల్స్‌పోలియో కార్యక్రమంలో భక్తులు మరియు స్థానికులు 0 నుండి 5 సంవత్సరాల లోపు చిన్నారులకు విధిగా పల్స్‌పోలియో చుక్కలు వేయించుకోవాలని సిఎంవో కోరారు. మార్చి 1వ తేదీ వ‌ర‌కు ప‌ల్స్ పోలియో కార్య‌క్ర‌మం జ‌రుతుందన్నారు.

 కాగా అశ్విని ఆసుపత్రి, జియన్‌సి, ఆర్‌టిసి బస్టాండ్‌, సిఆర్‌ఓ, పిఏసి 1 మరియు 2, ఎమ్‌బిసి-34, వైకుంఠం 1 మరియు 2, హెల్త్‌ ఆఫీసు, ఎటిసి, మేదరమిట్ట, వరాహస్వామి, రాంభగీఛ అతిథి గృహాలవద్ద, శ్రీవారి ఆలయం లోపల, కల్యాణకట్ట, బాలాజీ నగర్, టిటిడి ఉద్యోగుల డిస్పెన్సరి ఎస్‌.వి. హైస్కూల్‌, పాపావినాశనం, అలిపిరి కాలినడక మార్గంలో పల్స్‌ పోలియో కేంద్రాలను ఏర్పాటు చేశారు.   

ఈ కార్యక్రమంలో మెడికల్  సూపరింటెండెంట్లు డాక్టర్ ఎస్.కుసుమకుమారి, డాక్టర్ బి.కుసుమకుమారి, ఇతర డాక్టర్లు, పారా మెడికల్‌ సిబ్బంది పాల్గొన్నారు.

టీటీడీ  ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.