PURANDHARA DASA ARADAHANOTSAVAMS FROM FEB 3 TO 5_ పిబ్ర‌వరి 3 నుండి 5వతేదీ వరకు తిరుమలలో శ్రీ పురందరదాసుల ఆరాధనా మహోత్సవాలు

Tirupati, 2 February 2019: The Aradhana Mahotsavams of Kannada Pada Sahitya Pitamaha, Sri Purandhara Dasa will be observed from February 3 to 5 in Tirupati and Tirumala under the aegis of Dasa Sahitya Project.

Often considered as the incarnation of divine saint Sri Narada Maharshi, Purandharadasa was born in the year 1480 and was named Sri Srinivasa Nayaka. Later he attained sainthood and became popular as Purandhara Dasa and penned 4.75 keertanas in the praise of Lord Venkateswara and breathed his last in 1564.

The Aradhanotsavams will take place in Asthana Mandapam at Tirumala and Annamacharya Kalamandiram in Tirupati. There will be religious discourses by various pontiffs, community singing Haridasa Ranjani programme, Purandhara Sahiti Goshti literary programme during these days.

On February 4 there will be garlanding ceremony to the statue of Sri Purandhara Dasa at Alipiri by 6am and Unjal Seva to the Utsava Murthies in Narayanagiri Gardens of Tirumala the same day evening at 6pm.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

పిబ్ర‌వరి 3 నుండి 5వతేదీ వరకు తిరుమలలో శ్రీ పురందరదాసుల ఆరాధనా మహోత్సవాలు

తిరుమల, 2019 ఫిబ్ర‌వరి 02: కర్ణాటక సంగీత పితామహులు శ్రీ పురందరదాసుల ఆరాధనా మహోత్సవాలు టిటిడి దాససాహిత్యప్రాజెక్టు ఆధ్వర్యంలో పిబ్ర‌వ‌రి 3 నుంచి 5వ తేదీ వరకు తిరుమలలో జరుగనున్నాయి.

మొదటిరోజైన పిబ్ర‌వరి 3న ఆదివారం తిరుమలలోని ఆస్థాన మండ‌ప‌ములో ఉదయం 5.30 గం||ల నుండి 7.00 గం||ల వరకు సుప్రభాతం, ధ్యానం, సామూహిక భజన, నగరసంకీర్తన కార్యక్రమాలు, ఉదయం 8.30 గం||ల నుండి 9.30 గం||ల వరకు పురంధరదాసుల సాహితీ గోష్ఠి, ఉదయం 9.30 గం||ల నుండి మధ్యాహ్నం 12.00 గం||ల వరకు వివిధ పీఠాధిపతుల మంగళా శాసనాలు, మధ్యాహ్నం 2.30 గం||ల నుండి 5.30 గం||లవరకు సంకీర్తనమాల కార్యక్రమాలు నిర్వహిస్తారు.

రెండవ రోజైన పిబ్ర‌వరి 4న సోమ‌వారం ఉదయం 6.00 గంటలకు అలిపిరి చెంత పురందరదాసుల విగ్రహానికి పుష్పమాల సమర్పణ, అనంతరం తిరుమలలోని ఆస్థానమండపంలో ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12.00 వరకు వివిధ పీఠాధిపతుల మంగళా శాసనాలు, అదేరోజు సాయంత్రం 6.00 గం||టలకు శ్రీవారి ఆలయం నుండి నారాయణగిరి ఉద్యానవనం వరకు శ్రీవారి ఉత్సవమూర్తుల ఊరేగింపు, ఊంజల్‌సేవ, దాససంకీర్తన కార్యక్రమాలు ఉంటాయి.

చివరిరోజు పిబ్ర‌వరి 5వ తేదీ మంగ‌ళ‌వారం ఉదయం 6.00 గం||ల నుండి 7.30 గంట‌ల వ‌ర‌కు సుప్ర‌భాతం, ధ్యానం, సామూహిక భ‌జ‌న‌, న‌గ‌ర సంకీర్త‌న, ఉద‌యం 8.00 నుండి 9.00 గం||ల వరకు హరిదాస రసరంజని కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాలను దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ ఆనందతీర్థాచార్యులు పర్యవేక్షిస్తున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.