SRI VENKATESA NAVARATNA MALA SANKEERTHANA ENTRALLS DEVOTEES _ అలరించిన శ్రీ వేంకటేశ నవరత్నమాల సంకీర్తనా కార్యక్రమం

Tirumala, 12 January 2026: As part of the Sri Purandara Dasa Aradhana Mahotsavams, the Sri Venkatesa Navaratna Sankeerthana programme held on Monday evening at the Kalyanamastu Vedika on Papavinasanam Road, Tirumala, delighted the devotees.

Sri Ananda Theerthacharyulu, the Special Officer of the TTD Dasa Sahitya Project said as many as 300 renowned artists rendered Navaratna compositions by the Carnatic music Pitamaha Sri Purandara Dasa in praise of Sri Venkateswara on the occasion.

Sri Purandara Dasa Aradhana Mahotsavams will be conducted in a grand manner at Tirumala from January 17 to 19.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

అలరించిన శ్రీ వేంకటేశ నవరత్నమాల సంకీర్తనా కార్యక్రమం

తిరుమల, 2026 జనవరి 12: శ్రీ పురందరదాసుల ఆరాధన మహోత్సవాలలో భాగంగా సోమవారం సాయంత్రం తిరుమలలోని పాపవినాశనం రోడ్డులో గల కళ్యాణమస్తు వేదికపై నిర్వహించిన శ్రీ వేంకటేశ నవరత్న సంకీర్తనా కార్యక్రమం భక్తులను అలరించింది.

టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి శ్రీ ఆనందతీర్థాచార్యులు ఆధ్వర్యంలో కర్ణాటక సంగీత పితామహులు శ్రీ పురందరదాసుల వారు శ్రీ వేంకటేశ్వరస్వామిని స్తుతిస్తూ చేసిన సంకీర్తనలలో నవరత్నాలలాంటి  సంకీర్తనలను 300 మంది సుప్రసిద్ధ కళాకారులు గోష్ఠిగానం చేశారు.

కాగా జనవరి 17 నుండి 19వ తేది వరకు తిరుమలలో పురందరదాసుల ఆరాధన మహోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.