PURANDHARA DASA ARADHANA HELD IN TIRUMALA WITH SPIRITUAL FERVOUR _ భక్తిపారవశ్యంతో సాగిన పురందరదాస ఆరాధనోత్సవం – విచ్చేసిన శ్రీశ్రీశ్రీ సుజయనిధి తీర్థస్వామి 

SRI SUJAYANIDHI THEERTHA SWAMY GRACES THE OCCASION

TIRUMALA, 21 JANUARY 2023: The Aradhana Mahotsavam of Kannada Sangeetha Pitamaha,  Saint Poet Sri Purandhara Dasa was held with utmost spiritual fervour with hundreds of Dasaparas hailing from Karnataka, Tamilnadu apart from twin Telugu states having participated in the event at Tirumala on Saturday evening.

On the auspicious occasion, Sri Malayappa Swamy flanked by Sridevi and Bhudevi reached Narayanagiri Gardens after Sahasra Deepalankara Seva and unjal seva was performed on the occasion. The Special Officer of Dasa Project Sri Ananda Theerthacharya briefed about the impeccable services offered by Saint Purandhara Dasa to the world of Bhakti through his 4.75lakh sankeertans. 

Later a team of Dasaparas presented some versatile kritis of Sri Purandhara Dasa on the occasion starting with Guru vandana, followed by Bandalo Mahalakshmi, Ba ba Ranga, Yadava Nee Ba Yadukula Nandana, Sakalagrahaphala Neene and many more in a melodious manner enthralling the devotees in the ocean of Bhakti. Another team of Dasaparas presented dance ballet to each and every sankeertan and allured the devotees.

HH Sri Sujayanidhi Theertha Swamy of Sripadaraja Mutt of Mulabagula in Karnataka graced the occasion and rendered Anugraha Bhashanam. He recalled the great Nama Sankeertana service offered by Sri Purandharadasa with his soulful Sankeertans. “He is immortal since we are all rendering the Bhagavannamas through his Sankeertans even after several centuries and the same will continue in future also”, he said.

Later he was presented with the prasadams of Srivaru. The seer offered blessings to JEO (H&E) Smt Sada Bhargavi and other participants. 

VGO Sri Bali Reddy, Temple Peishkar Sri Srihari, Parpattedar Sri Uma Maheshwar Reddy and others were also present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

భక్తిపారవశ్యంతో సాగిన పురందరదాస ఆరాధనోత్సవం – విచ్చేసిన శ్రీశ్రీశ్రీ సుజయనిధి తీర్థస్వామి

తిరుమల, 21 జనవరి 2023: శ్రీవారి పరమభక్తుడు, కర్ణాటక సంగీత పితామహుడు అయిన శ్రీపురందరదాసుల ఆరాధన మహోత్సవం శనివారం సాయంత్రం తిరుమల నారాయణగిరి ఉద్యానవనాల్లో భక్తిపారవశ్యంతో సాగింది. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు నుండి వచ్చిన వందలాది మంది దాస సాహిత్య ప్రాజెక్టు భజన మండళ్ల సభ్యులు పాల్గొన్నారు. కర్ణాటకలోని ముళబాగళ్ శ్రీపాదరాజ మఠాధిపతి శ్రీ సుజయనిధి తీర్థ స్వామివారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

శ్రీవారి ఆలయంలో సహస్ర దీపాలంకార సేవ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు నారాయణగిరి ఉద్యానవనానికి చేరుకున్నారు. విశేషంగా అలంకరించిన ఇక్కడి మండపంలో ఊంజల్ సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా దాస ప్రాజెక్ట్ ప్రత్యేకాధికారి శ్రీ ఆనంద తీర్థాచార్యులు మాట్లాడుతూ
శ్రీ పురందరదాసు 4.75 లక్షల సంకీర్తనల ద్వారా భక్తి ప్రపంచానికి విశేషమైన సేవలందించారని తెలిపారు.

అనంతరం భజనమండళ్ల సభ్యులు పలు శ్రీ పురందరదాస సంకీర్తనలు ఆలపించారు. ముందుగా గురువందనంతో ప్రారంభించి, తర్వాత “బందాలో మహాలక్ష్మి…”, “బా బా రంగ…”, “యాదవ నీ బా యదుకుల నందన…”, “సకలగ్రహఫల నీనే…” తదితర సంకీర్తనలు ఆలపించారు. ఈ సంకీర్తనలకు భజన బృందం సభ్యుల నృత్యం అలరించింది.

ఈ కార్యక్రమంలో జెఈఓ శ్రీమతి సదా భార్గవి, విజివో శ్రీ బాలిరెడ్డి, ఆలయ పేష్కార్ శ్రీ శ్రీహరి, పారుపత్తేదార్ శ్రీ ఉమామహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.