PURANDHARA DASA SANKEERTANS RENDERED _ పురందరదాస కీర్తనలతో మారుమోగిన స‌ప్త‌గిరులు

Tirumala, 07 February 2024:   The Saptagiris echoed to the melodious rendition of  Sri Purandaradasa’s kritis sung by around 300 famous artistes.

As part of the Aradhana Mahotsavams of Sri Purandara Dasa, a Sankeertana program titled, “Sri Venkatesa Navaratnamala” was held at Kalyana Vedika on Wednesday evening.

In this program organized under the auspices of the TTD Dasa Sahitya Project, artists collectively sang the works of Purandara Dasa.  In this “Dasana Madiko Enna”…

 “Indu Ninna Samrayahokke…Venkatesane”, “Tirupathi Venkataramana Ninagetake Barado Karuna”, Shobhane Shobhane…etc Sankeetans flooded the sea of ​​devotion and enthralled devotees.

Dasa Sahitya Project Special Officer Dr. PR Ananda Theerthacharyulu, eminent musician Dr. Dwaram Lakshmi,

Others participated.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

పురందరదాస కీర్తనలతో మారుమోగిన స‌ప్త‌గిరులు

తిరుమ‌ల‌, 2024 ఫిబ్ర‌వ‌రి 07: తిరుమలలోని క‌ల్యాణ వేదికలో దాదాపు 300 మంది ప్ర‌ముఖ క‌ళాకారులు ఆల‌పించిన పురంద‌రదాసుల కీర్త‌ల‌న‌తో స‌ప్త‌గిరులు మారుమోగాయి. శ్రీ పురందరదాసులవారి ఆరాధన మహోత్సవాలలో భాగంగా బుద‌వారం సాయంత్రం ” శ్రీ వేంక‌టేశ న‌వ‌ర‌త్న‌మాల ” సంకీర్త‌నా కార్య‌క్ర‌మం వైభ‌వంగా జ‌రిగింది.

టీటీడీ దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో దాస భక్తులు సామూహికంగా పురందరదాస కృతులను ఆలపించారు. ఇందులో “”దాసన మాడికో ఎన్న”…

”ఇందు నిన్న స్మరయ… వెంకటేశనే”, ”తిరుపతి వెంకటరమణ…బారదో కరుణ”, శోభానే శోభానే… తదితర కీర్తనలు భక్తి సాగరంలో ముంచెత్తాయి.

దాససాహిత్య ప్రాజెక్టు ప్ర‌త్యేకాధికారి శ్రీ పిఆర్ ఆనంద తీర్థచార్యులు, ప్రముఖ సంగీతకారిణి డా.ద్వారం లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.