PURNAHUTI PERFORMED TO SRI GT PAVITROTSAVAMS_ పూర్ణాహుతితో ముగిసిన శ్రీ‌ గోవిందరాజస్వామివారి ప‌విత్రోత్స‌వాలు

Tirupati, 3 September 2017:The three day annual pavitrotsavams concluded on a ceremonial note in Sri Govindaraja Swamy temple on Sunday.

On the third day Pavitra Purnahuti was performed by the archakas in yagashala as per the tenets of vaikhanasa agama.

Temple DyEO Smt Varalakshmi, AEO Sri Prasadamurthy Raju were also present


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

పూర్ణాహుతితో ముగిసిన శ్రీ‌ గోవిందరాజస్వామివారి ప‌విత్రోత్స‌వాలు

సెప్టెంబరు 03, తిరుపతి, 2017: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆల‌యంలో ఆదివారం రాత్రి పూర్ణాహుతితో ప‌విత్రోత్స‌వాలు ముగియ‌నున్నాయి.

ఈ సందర్భంగా ఉదయం 10.30 నుంచి 12.30 గంటల వరకు కల్యాణమండపంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఆ త‌రువాత‌ సాయంత్రం 5.30 నుంచి 6.30 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారికి ఉత్సవమూర్తులకు తిరువీధి ఉత్సవం జరుగనుంది. ఆ త‌రువాత రాత్రి యాగ‌శాల‌లో వైదిక కార్య‌క్ర‌మాలు, పూర్ణాహుతి, ప్ర‌బంధ శాత్తుమొర‌, వేద శాత్తుమొర నిర్వ‌హిస్తారు. అనంత‌రం ఉత్స‌వ‌మూర్తులు కుంభం విమాన‌ప్ర‌ద‌క్షిణంగా స‌న్నిధికి వేంచేపు చేస్తారు.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానికాల‌యాల డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ ప్రసాదమూర్తిరాజు ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.