PURUSAIVARI TOTOTSAVAM HELD IN TIRUMALA _ తిరుమలలో ఘనంగా పురుశైవారి తోట ఉత్సవం

Tirumala, 26 July 2017: Purusaitototsavam has been observed with religious fervour on Wednesday evening in Tirumala. This unique religious fete is associated to Sri Anantazhwan, an ardent devotee of Lord Venkateswara who ascended to Paramapadam.

After Sahasra Deepalankara Seva, the processional deities of Sri Malayappa Swamy accompanied by his two Consorts Sridevi and Bhudevi were taken to Sri Purusaivari Tota. Astanam was performed to the processional deities. Later, the special garlands of Lord Malayappa were decorated to Pogada tree(Styphonolobium japanicum) which is believed to be representing Sri Anantazhwan.

Sri Anantazhwan (1053 AD) dedicated his 102 years in the service of Sri Venkateswara through Pushpa kainkaryam. To mark the contributions of this great Sri Vaishnava Saint, Purusaivari Tototsavam is performed TTD every year in Tirumala. TTD officers took part in this fete.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

తిరుమలలో ఘనంగా పురుశైవారి తోట ఉత్సవం

జూలై 26, తిరుమల, 2017: శ్రీవేంకటేశ్వరస్వామివారిపై అచంచలమైన భక్తివిశ్వాసాలను ప్రదర్శించిన ప్రముఖ శ్రీవైష్ణవాచార్యుడు శ్రీ అనంతాళ్వార్‌ పరమపదించి స్వామివారిలో ఐక్యమైన సందర్భాన్ని పురస్కరించుకుని తిరుమలలో బుధవారం నాడు పురుశైవారి(అనంతాళ్వార్‌తోట) తోట ఉత్సవం ఘనంగా జరిగింది.

ఈ సందర్భంగా సహస్ర దీపాలంకార సేవ అనంతరం సాయంత్రం 6 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు పురుశైవారితోటకు వేంచేపు చేశారు. అక్కడ నివేదనల అనంతరం స్వామి, అమ్మవార్లు బయల్దేరి పొగడ చెట్టు వద్దకు రాగానే హారతి ఇచ్చారు. ఆ శేషహారతి, పుష్పసరము, శ్రీ శఠారి పొగడ చెట్టునకు సమర్పించారు. శ్రీ శఠారికి అభిషేకం అనంతరం తిరిగి తిరుచ్చిపై ఉంచారు. అక్కడినుంచి స్వామి, అమ్మవార్లు ఆలయ మాడ వీధుల గుండా ఊరేగింపుగా తిరిగి శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో టిటిడి అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.