PUSHPA YAGAM AT SRI KODANDA RAMA SWAMY TEMPLE ON MAY 12 _ మే 12న శ్రీ కోదండ రామ‌స్వామివారి ఆల‌యంలో పుష్పయాగం

Tirupati, 06 May 2024: Pushpayagam will be performed on May 12 at Tirupati Sri Kodandarama Swamy Temple with Ankurarpanam on May 11 

On May 12 between 10 am and 11 am Snana Tirumanjanam will be conducted for the Utsavarlu.

Later, from 4pm to 6 pm, along with Sita and Lakshmana, Sri Kodandarama Swamy is offered with various kinds of flowers.  

Later, at 7 o’clock in the night, Sri Kodandarama Swami along with Sri Seetha Devi and Sri Lakshmana Swamy blesses the devotees in the four mada streets of the temple.  

Grihastas (two persons on a ticket) can participate in Pushpayagam by paying Rs.1,000/- per ticket.

The annual Brahmotsavam was held from April 5 to 13.

Pushpayagam is performed as a sin-free ritual to the errors committed by the priestly attendants, office staff, non-authorities or devotees with or without their knowledge.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

మే 12న శ్రీ కోదండ రామ‌స్వామివారి ఆల‌యంలో పుష్పయాగం

తిరుపతి, 2024 మే 06: తిరుపతి శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో మే 12వ తేదీన పుష్పయాగం నిర్వ‌హించ‌నున్నారు. మే 11వ తేదీన సాయంత్రం పుష్పయాగానికి అంకురార్పణ జ‌రుగ‌నుంది.

మే 12న ఉదయం 10 నుండి 11 గంటల వ‌ర‌కు స్వామి, అమ్మ‌వారి ఉత్స‌వ‌ర్ల‌కు స్నపన తిరుమంజనం నిర్వ‌హిస్తారు. అనంత‌రం సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు సీతా ల‌క్ష్మ‌ణ స‌మేత శ్రీ కోదండ‌రామ‌స్వామివారికి పలు రకాల పుష్పాలతో అభిషేకం చేస్తారు. అనంతరం రాత్రి 7 గంటలకు శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామివారు ఆల‌య నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భ‌క్తుల‌ను అనుగ్ర‌హిస్తారు. గృహస్తులు(ఇద్దరు) రూ.1,000/- చెల్లించి టికెట్‌ కొనుగోలుచేసి పుష్పయాగంలో పాల్గొనవచ్చు.

శ్రీ కోదండరామాలయంలో ఏప్రిల్ 5 నుండి 13వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం విదితమే. ఈ బ్రహ్మోత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ యాగం నిర్వహణ వల్ల సమస్తదోషాలు తొలగిపోతాయని అర్చకులు తెలిపారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.