PUSHPAYAGAM IN KRT ON MAY 7 _ మే 7న శ్రీ కోదండరామాలయంలో పుష్పయాగం
TIRUPATI, 04 MAY 2022: The annual Pushpayagam in Sri Kodanda Rama Swamy temple in Tirupati will be held on May 7 with Ankurarpanam on May 6.
It may be recalled that the annual Brahmotsavams in this ancient temple was observed from March 30 to April 8.
The annual Pushpayagam will be held in the evening between 3pm and 5:30pm. The gruhastas were allowed to participate in the fete on payment of Rs.500 per ticket on which two persons will be allowed.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
మే 7న శ్రీ కోదండరామాలయంలో పుష్పయాగం
తిరుపతి, 2022 మే 04: తిరుపతి శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో మే 7వ తేదీన పుష్పయాగం నిర్వహించనున్నారు. మే 6వ తేదీన సాయంత్రం పుష్పయాగానికి అంకురార్పణ జరుగనుంది.
మే 7న ఉదయం 10 నుండి 11 గంటల వరకు స్వామి, అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారికి పలు రకాల పుష్పాలతో అభిషేకం చేస్తారు. అనంతరం సాయంత్రం 5.30 గంటలకు శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహిస్తారు. గృహస్తులు(ఇద్దరు) రూ.500/- చెల్లించి టికెట్ కొనుగోలుచేసి పుష్పయాగంలో పాల్గొనవచ్చు.
శ్రీ కోదండరామాలయంలో మార్చి 30 నుండి ఏప్రిల్ 8వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం విదితమే. ఈ బ్రహ్మోత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ యాగం నిర్వహణ వల్ల సమస్తదోషాలు తొలగిపోతాయని అర్చకులు తెలిపారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.