PUSHPAYAGAM OBSERVED AT APPALAYAGUNTA_ అప్పలాయగుంటలో పుష్పయాగం.. భ‌క్తుల త‌న్మ‌య‌త్వం..

Appalayagunta, 18 July 2019: The annual Pushpayagam was observed with religious fervour in Sri Prasanna Venkateswara Swamy temple at Appalayagunta on Thursday.

This fete is usually observed to waive off the sins committed either knowingly or unknowingly by religious, office staffs and even devotees.

The utsava deities were seated on a separate platform and Pushpayagam was observed with tonnes of varieties of traditional flowers between 3pm and 6pm.

Tirupati JEO Sri Basant Kumar, Temple DyEO Smt Jhansi Rani, AEO Sri Subramanyam, Kankana Bhattar Sri Suryakumar Acharyulu, Temple Inspector Sri Srinivasulu and devotees took part.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

అప్పలాయగుంటలో పుష్పయాగం.. భ‌క్తుల త‌న్మ‌య‌త్వం..

జూలై 18, తిరుపతి, 2019: టిటిడికి అనుబంధంగా ఉన్న అప్పలాయగుంటలోని శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో గురువారం పుష్పయాగం వైభవంగా జరిగింది. ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి తిరుప‌తి జెఈవో శ్రీ పి.బ‌సంత్ కుమార్ దంప‌తులు పాల్గొన్నారు. ఆద్యంతం శోభాయమానంగా సాగిన ఈ పుష్పయాగ మహోత్సవాన్ని చూసి భక్తులు తన్మయత్వం చెందారు.

ఈ సంద‌ర్భంగా జెఈవో మాట్లాడుతూ ఆలయంలో జూన్‌ 13 నుండి 21వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగాయ‌న్నారు. నిత్యకైంకర్యాల్లో గానీ, బ్రహ్మోత్సవాల్లో గానీ, అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటిని నివృత్తి చేసుకునేందుకు పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంద‌న్నారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన దాతలు ఒక‌టిన్న‌ర ట‌న్ను పుష్పాలను విరాళంగా అందించిన‌ట్టు తెలిపారు.

కాగా, ఉదయం 10.30 నుంచి 12 గంటల వరకు ఉభయదేవేరులతో కూడిన శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారికి స్నపనతిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు. ముందుగా పుష్పయాగం కోసం వినియోగించే పుష్పాలను ఆలయంలో మూలమూర్తి వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తరువాత ఆలయ ప్రదక్షిణగా వెళ్లి మాడ వీధుల్లో ఊరేగింపు చేపట్టారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన వేదికపై సర్వభూపాల వాహనంలో శ్రీపద్మావతి, శ్రీఆండాళ్‌ సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారిని కొలువుతీర్చారు. మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 6 గంటల వరకు అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ పుష్పయాగం వైభవంగా జరిగింది. తులసి, చామంతి, గన్నేరు, మొగలి, సంపంగి, రోజా, కలువలు వంటి 14 రకాలకు చెందిన ఒక‌టిన్నర టన్నుల పుష్పాలు, పత్రాలతో పుష్పయాగం నిర్వహించారు. ఆ తరువాత వీధి ఉత్సవం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి ఝాన్సీరాణి, ఇఇ శ్రీ స‌త్య‌నారాయ‌ణ‌, ఏఈవో శ్రీ సుబ్రమణ్యం, కంకణభట్టార్‌ శ్రీ సూర్యకుమార్‌ ఆచార్యులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ శ్రీనివాసులు, ఇతర ఆధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.