PUSHPAYAGAM PERFORMED _ సప్తవర్ణశోభితం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పుష్పయాగం

TIRUPATI, 04 APRIL 2024: The annual Pushpayagam was observed with celestial fervour at Sri Kalyana Venkateswara Swamy temple in Srinivasa Mangapuram on Thursday evening.

Three tons of a dozen varieties of flower and half a dozen leaves were used to render floral bath to the processional deities from 2pm to 5pm.

Earlier during the day, Snapana Tirumanjanam was performed.

TTD has cancelled Tiruppavada and Kalyanotsavam in view of Pushpayagam in the temple.

Special Grade DyEO Smt Varalakshmi, Garden Deputy Director Sri Srinivasulu, AEO Sri Gopinath, Garden Manager Sri Janardhan Reddy and other temple staff, devotees were present.endant Sri Hari Narayanacharyulu and others present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

సప్తవర్ణశోభితం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పుష్పయాగం

తిరుపతి, 2024 ఏప్రిల్ 04: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో గురువారం పుష్పయాగ మహోత్సవం వైభవంగా జరిగింది.

ఈ సందర్భంగా గురువారం ఉదయం 7 నుండి 10 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వ‌హించారు. ఉదయం 10 నుండి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంల‌తో అభిషేకం చేశారు.

మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు పుష్పయాగం కన్నులపండుగగా నిర్వహించారు. 12 రకాల పుష్పాలు, 6 రకాల ఆకులతో స్వామివారికి పుష్పయాగాన్ని నిర్వహించారు. చామంతి, రోజాలు, గన్నేరు, సంపంగి, మల్లెలు, రుక్షి, కనకాంబరాలు, తామర, కలువ, మొగలిరేకులు, మాను సంపంగి పుష్పాలు, తులసి, దవనం, మరవం, బిల్వం, పన్నీరాకు వంటి ఆకులను ఉపయోగించారు. పుష్పయాగానికి 3 టన్నుల పుష్పాలను దాతలు విరాళంగా అందించారు. తమిళనాడు, కర్నాటక, ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి పుష్పాలు విరాళంగా అందాయి.

ఈ కార్యక్రమంలో ఆలయ ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, గార్డెన్ సూప‌రింటెండెంట్ శ్రీ శ్రీ‌నివాసులు, గార్డెన్ మేనేజర్ శ్రీ జనార్దన్ రెడ్డి, ఏఈవో శ్రీ గోపినాథ్‌, సూపరింటెండెంట్లు శ్రీ చెంగ‌ల్రాయులు, శ్రీ వెంక‌ట‌స్వామి, ఆల‌య అర్చ‌కులు శ్రీ బాలాజి రంగాచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.