QUALITY MEDICARE TO TTD SNAKE CATCHER BHASKAR NAIDU: TTD _ శ్రీ భాస్క‌ర్‌నాయుడుకు మెరుగైన వైద్య‌స‌హాయం : టిటిడి

TTD DENIES POLITICAL ALLEGATIONS

 

Tirupati, 03 February 2022: TTD on Thursday denied allegations by some political persons who claimed that there was no proper Medicare for TTD Snake catcher Sri Bhaskar Naidu.

 

In a statement released on Thursday the TTD said Sri Bhaskar Naidu who suffered snakebite a few days ago was first treated at SVIMS and following health complications, he was shifted to Private speciality Amara hospital for treatment.

 

On the directions of Additional EO Sri AV Dharma Reddy, the TTD JEO Sri Veerabrahmam is monitoring the health progress of the retired Forest employee which is said to be steady.

 

TTD CMO Dr Muralidhar, in charge DFO Smt Prashanti, BIRRD hospital OSD Dr Reddappa Reddy are reviewing treatment of Sri Bhaskar Naidu with the hospital authorities from time to time.

 

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

శ్రీ భాస్క‌ర్‌నాయుడుకు మెరుగైన వైద్య‌స‌హాయం : టిటిడి

కొందరు రాజకీయ నాయకుల ఆరోపణలపై ఖండన

తిరుప‌తి, 2022 ఫిబ్ర‌వ‌రి 03: టిటిడి అట‌వీ విభాగంలో పాములు ప‌ట్టే విధులు నిర్వ‌హిస్తున్న ఉద్యోగి శ్రీ భాస్క‌ర్‌నాయుడుకు మెరుగైన వైద్య స‌హాయం అందించ‌డం జ‌రుగుతోంది. అయితే శ్రీ భాస్కర్ నాయుడు ఆరోగ్య పరిస్థితిని టిటిడి పట్టించుకోవడం లేదని తిరుపతికి చెందిన కొందరు రాజకీయ పార్టీల నాయకులు ఆరోపించడాన్ని టిటిడి తీవ్రంగా ఖండిస్తోంది.

శ్రీ భాస్క‌ర్‌నాయుడు పాముకాటుకు గురై తీవ్ర అస్వస్థతకు గురికావ‌డంతో మొద‌ట స్విమ్స్‌లో వైద్యం అందించారు. పాముకాటుతోపాటు ఇత‌ర స‌మ‌స్య‌లు త‌లెత్త‌డంతో మెరుగైన వైద్యం కోసం తిరుప‌తిలోని అమ‌ర ఆసుప‌త్రికి త‌రలించారు.

అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి ఆదేశాల మేర‌కు జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిస్థితిని తెలుసుకుని వైద్యానికి అవ‌స‌ర‌మైన స‌హాయం అందిస్తున్నారు. శ్రీ భాస్క‌ర్‌నాయుడు ఆరోగ్య ప‌రిస్థితిని టిటిడి డాక్ట‌ర్లు ఆరా తీస్తున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉండ‌డంతో కుటుంబ స‌భ్యుల‌కు ధైర్యం చెబుతున్నారు.

టిటిడి సిఎంఓ డాక్ట‌ర్ ముర‌ళీధ‌ర్‌, ఇన్‌చార్జి డిఎఫ్‌వో శ్రీమ‌తి ప్ర‌శాంతి, బ‌ర్డ్ ప్ర‌త్యేకాధికారి డాక్ట‌ర్ రెడ్డెప్ప‌రెడ్డి క‌లిసి శ్రీ భాస్క‌ర్‌నాయుడుకు అందిస్తున్న వైద్య‌సేవ‌ల‌ను స‌మీక్షిస్తున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.