QUALITY SERVICE TO DEVOTEES WITH NEXT GEN TECHNOLOGY- ESCI EXPERT _ నూతన పరిజ్ఞానం అవగాహనతో మరింత మెరుగైన సేవలు
SIX-DAY TRAINING PROGRAM FOR TTD EMPLOYEES AT SVETA
Tirupati, 19 January 2022: Sri Praveen Kumar, Expert from Engineering staff College of India (ESCI) said that the TTD and its employees could render better service to devotees only through the adoption of trendy tech advances in software etc.
Addressing a six-day refresher training program for TTD employees at SVETA on Wednesday the tech expert said Engineering is embedded in Technology and all employees are exposed to new trends in the maintenance of roads, buildings, plugging leakages, technical knowledge in tenders, and maintenance of all equipments.
TTD SE Sri Satyanarayana said such training programs helps the employees to update their skills in addition to their experience.
SVETA Director Smt Prashanti expressed happiness over ESCI experts training TTD employees. She said the civil engineering wing plays a predominant role in offering the best possible services to devotees.
Deputy Chief Engineer Sri Prasad and others were present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
నూతన పరిజ్ఞానం అవగాహనతో మరింత మెరుగైన సేవలు
– టీటీడీ ఇంజినీరింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమంలో ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ నిపుణులు శ్రీ ప్రవీణ్ కుమార్
– ఆరు రోజుల పాటు కొనసాగనున్న శిక్షణ కార్యక్రమంలో
తిరుపతి 19 జనవరి 2022: సివిల్ ఇంజినీరింగ్ లో రోజు రోజుకు అభివృద్ధి చెందుతున్న పరిజ్ఞానం, మెళకువలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ద్వారా సంస్థకు మరింత ఉన్నత సేవలు అందించే అవకాశం కలుగుతుందని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా నిపుణులు శ్రీ ప్రవీణ్ కుమార్ చెప్పారు.
శ్రీ వేంకటేశ్వర ఉద్యోగుల శిక్షణ సంస్థ (శ్వేత) లో బుధవారం ఇంజినీరింగ్ అధికారులకు ఆరు రోజుల శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది.
ఈ సందర్భంగా శ్రీ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, ఇంజినీరింగ్ లేనిదే టెక్నాలజీ లేదని చెప్పారు. రోడ్లు, భవనాల నిర్వహణ, లీకేజీలు అరికట్టడం, టెండర్లు నిర్వహణ అంశాల్లో నూతన సాంకేతిక పరిజ్ఞానం, యంత్రాల నిర్వహణ అంశాలపై ఈ శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. తెలియంది నేర్చుకోవడానికి వయసుతో పనిలేదని, నూతన పరిజ్ఞానం,మెళకువలు అందిపుచ్చుకోవడం వల్ల సంస్థ కు మరింత మెరుగైన సేవలు అందించేందుకు అవకాశం కలుగుతుందన్నారు. టీటీడీ లో శిక్షణ కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు.
టీటీడీ ఎస్ ఈ శ్రీ సత్యనారాయణ మాట్లాడుతూ, ఇంజినీరింగ్ అధికారులు, సిబ్బంది పరిజ్ఞానం పెంపొందించుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని చెప్పారు. అనుభవంతో పాటు ఇంజినీరింగ్ లో జరుగుతున్న మార్పులు, నూతన మెళకువలు ఎప్పటికప్పుడు అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.
శ్వేత డైరెక్టర్ శ్రీమతి ప్రశాంతి మాట్లాడుతూ, ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా నిపుణులు వచ్చి శిక్షణ ఇవ్వడం సంతోషకరమన్నారు. టీటీడీ లో సివిల్ ఇంజినీరింగ్ విభాగం పాత్ర కీలకమని, నూతన మెళకువలు తెలుసుకోవడం మంచిదని అన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు.
డిప్యూటీ చీఫ్ ఇంజినీర్ శ్రీ ప్రసాద్ తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది