R-DAY FETE IN TTD PARADE GROUNDS _ టిటిడి పరిపాలన భవనంలో గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు పూర్తి
TIRUPATI, 24 JANUARY 2023: The Republic Day celebrations will be observed by TTD in its Parade Grounds located on the backside of the TTD Administrative Building in Tirupati on January 26.
TTD EO Sri AV Dharma Reddy will hoist the National Flag and deliver his R-Day speech followed by the Parade by various security battalions. Later the cultural events by the students of various TTD educations institutions follows. The event concludes with the EO giving away the excellency awards to the officers’ and employees who showcased their work skills.
The entire building and its premises decked up for the occasion.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
టిటిడి పరిపాలన భవనంలో గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు పూర్తి
తిరుపతి, 2023 జనవరి 24: తిరుపతి టిటిడి పరిపాలన భవనంలో జనవరి 26వ తేదీ గురువారం నిర్వహించనున్న గణతంత్ర వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
పరిపాలన భవనం వెనక వైపున గల పరేడ్ మైదానంలో టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీ ఏవి ధర్మారెడ్డి ఉదయం 8.30 గంటలకు జాతీయ జెండాను ఎగురవేస్తారు. అనంతరం ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. విధినిర్వహణలో ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేయనున్నారు.
ఈ సందర్భంగా టిటిడి భద్రతా విభాగంలోని బెటాలియన్ల పరేడ్, విద్యాసంస్థల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శిస్తారు.
ఈ కార్యక్రమంలో టిటిడిలోని ఉన్నతాధికారులు, విభాగాధిపతులు, ఉద్యోగులు పాల్గొంటారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.