RADHASAPTHAMI IN TIRUCHANOOR ON JAN 28 _ జనవరి 28న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో రథసప్తమి
TIRUPATI, 10 JANUARY 2023: In connection with Radhasapthami on January 28, Goddess Sri Padmavathi Devi will take a celestial ride on seven different vahanams starting from 7am till 9;30pm in Tiruchanoor.
The vahana sevas will commence with Suryaprabha followed by Hamsa, Aswa, Garuda, ChAAinna Sesha, Chandraprabha and Gaja Vahanams.
In the evening between 3:30pm and 4:30pm Snapana Tirumanjanam will be performed to Sri Padmavathi Ammavaru in Sri Krishna Mukha Mandapam.
In connection with Radhasapthami, Koil Alwar Tirumanjanam will be performed on January 24.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
జనవరి 28న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో రథసప్తమి
తిరుపతి, 2023 జనవరి 10: జనవరి 28వ తేదీన రథసప్తమి పర్వదినం సందర్భంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు ఏడు ప్రధాన వాహనాలపై ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు.
ఉదయం 7 నుండి 8 గంటల వరకు సూర్యప్రభ వాహనం, ఉదయం 8.30 నుండి 9.30 గంటల వరకు హంస వాహనం, ఉదయం 10 నుండి 11 గంటల వరకు అశ్వ వాహనం, ఉదయం 11.30 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు గరుడ వాహనం, మధ్యాహ్నం 1 నుండి 2 గంటల వరకు చిన్నశేష వాహనం, సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంటల వరకు చంద్రప్రభ వాహనం, రాత్రి 8.30 నుండి 9.30 గంటల వరకు గజ వాహన సేవ నిర్వహిస్తారు.
కాగా సాయంత్రం 3.30 నుండి 4.30 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలోని శ్రీ కృష్ణస్వామివారి ముఖ మండపంలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు.
ఈసందర్భంగా అమ్మవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిత కల్యాణోత్సవం, సామవేద పుష్పాంజలి, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది.
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం పక్కన గల శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో ఉదయం 6.00 నుండి 7.00 గంటల వరకు స్వామివారు అశ్వవాహనాన్ని అధిష్టించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.
జనవరి 24న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయంలో రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని జనవరి 24వ తేదీ ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.