RATHOTSAVAM HELD_ భక్తుల మనోరథాన్ని అధిరోహించిన దేవదేవుడు
Tirupati, 07 March 2024: On the penultimate day of Sri Kalyana Venkateswara Brahmotsavams at Srinivasa Mangapuram, Rathotsavam was held with celestial grandeur on Thursday.
Devotees made a beeline to drag the chariot along Mada streets.
On March 8, the annual fete culminates with Chakra Snanam. Before that Snapana Tirumanjanam will be performed to the Utsava deities.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
భక్తుల మనోరథాన్ని అధిరోహించిన దేవదేవుడు
• వేడుకగా రథోత్సవం
• భక్తి శ్రద్ధలతో రథాన్ని లాగిన భక్తులు
– మార్చి 8న చక్రస్నానం
తిరుపతి, 2024 మార్చి 07: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన గురువారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు రథాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమిచ్చారు.
ఉదయం 8 నుండి 9 గంటల వరకు శ్రీ భూ సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి రథాన్ని లాగారు. భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
శ్రీవారి రథాన్ని దర్శించిన వారికి జన్మాదిదుఃఖాలు నశించి, మోక్షం లభిస్తుంది. రథస్తుడైన మాధవుడిని దర్శిస్తే పునర్జన్మ ఉండదని అర్చకులు తెలిపారు.
రాత్రి 7 నుండి 8 గంటల వరకు అశ్వ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
ఈ కార్యక్రమంలో సిఇ శ్రీ నాగేశ్వరావు, ఇఇలు శ్రీ ప్రసాద్, శ్రీమతి సుమతి, శ్రీ వేణు గోపాల్, డెప్యూటీ ఇఇలు శ్రీ హర్షవర్థన్‌రెడ్డి, శ్రీ దామోదరం, ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, విజివో శ్రీ బాలిరెడ్డి, ఏఈవో శ్రీ గోపినాథ్, వైఖానస ఆగమ సలహాదారులు శ్రీ మోహన రంగాచార్యులు, ఏఇ శ్రీ చంద్ర శేఖర్, సూపరింటెండెంట్లు శ్రీ చెంగల్రాయులు, ఆలయ అర్చకులు శ్రీ బాలాజీ రంగాచార్యులు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
మార్చి 8న చక్రస్నానం :
శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరిరోజైన శుక్రవారం ఉదయం చక్రస్నానం వైభవంగా జరుగనుంది. ఇందులో భాగంగా ఉదయం 8.30 నుండి 9.30 గంటల వరకు వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 9.45 గంటలకు ఆలయం ఎదురుగా గల పుష్కరిణిలో చక్రత్తాళ్వార్‌కు శాస్త్రోక్తంగా చక్రస్నానం జరుగనుంది.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.