RAJAGOPALA BLESSES DEVOTEES ON THE DIVINE TREE _ కల్పవృక్ష వాహనంపై రాజగోపాల స్వామి అలంకారంలో శ్రీ కల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామి 

TIRUPATI, 03 JUNE 2023: As a part of ongoing annual brahmotsavams in Narayanavanam, Sri Kalyana Venkateswara took a celestial ride on Kalpavriksha Vahanam on Saturday in Rajagoapala Alankaram.

Later Snapanam was performed to the deities between 10am and 11am.

Temple Inspector Sri Nagaraju, devotees participated.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI 

కల్పవృక్ష వాహనంపై రాజగోపాల స్వామి అలంకారంలో శ్రీ కల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామి

తిరుపతి, 2023 జూన్‌ 03: నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన శనివారం ఉదయం స్వామివారు శ్రీ రాజగోపాల స్వామి అలంకారంలో కల్పవృక్ష వాహనంపై ద‌ర్శ‌మిచ్చారు. మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఆలయ మాడ వీధుల్లో కోలాహలంగా వాహనసేవ జరిగింది.

అనంతరం ఉదయం 10 నుండి 11 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేశారు.

వాహనసేవలో టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ నాగరాజు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.