RAMANUJA AVATAROTSAVAMS CONCLUDES _ తెలుగు సాహితీ ప్రక్రియలపై మెండుగా రామానుజులవారి ప్రభావం : శ్రీ కె.సేతురామ‌న్‌

TIRUPATI, 05 MAY 2022: The 1006th Ramanuja Avatarotsavams concluded on a grand note in Tirupati on Thursday evening.

 

Scholar Sri K Seturaman spoke on the literary works and skills of the Vaishnava saint.

 

Later Sri G Madhusudhan Rao and his team performed Sankeertans.

 

All Projects Officer Sri Vijayasaradhi, Alwar Divya Prabandha Project Coordinator Sri Purushottam, Program Assistant Smt Kokila were also present.

 

The three day fete concluded on a grand note at Annamacharya Kalamandiram in Tirupati on Thursday evening.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

తెలుగు సాహితీ ప్రక్రియలపై మెండుగా రామానుజులవారి ప్రభావం : శ్రీ కె.సేతురామ‌న్‌

తిరుపతి, 2022 మే 05: తెలుగు సాహిత్యంలోని పద్యం, గద్యం, కావ్యం, నాటకం తదితర అన్ని ప్రక్రియలపై భగవద్‌ రామానుజులవారి రచనల ప్రభావం మెండుగా ఉందని అహోబిలంకు చెందిన ప్రముఖ పండితులు శ్రీ కె.సేతురామ‌న్‌ తెలిపారు. టిటిడి ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో మూడు రోజుల పాటు జరిగిన రామానుజాచార్యుల 1006వ అవ‌తార మ‌హోత్స‌వాలు గురువారం ముగిశాయి.

ఈ సంద‌ర్భంగా శ్రీ కె.సేతురామ‌న్ ‘ శ్రీ రామానుజాచార్యుల గ్రంథ‌ములు వాటి వైశిష్ట్యం ‘ అనే అంశంపై ఉపన్యసిస్తూ రామానుజులవారి బోధనలు శిష్యపరంపర ద్వారా దేశం నలుమూలలా నేటికీ ప్రచారంలో ఉన్నాయన్నారు. రామానుజులు రచించిన శరణాగతి గద్యం, శ్రీరంగ గద్యం, వైకుంఠ గద్యం, వేదార్థ సంగ్రహం, శ్రీభాష్యం తదితర తొమ్మిది గ్రంథాలను పాశ్చాత్యులు సైతం ఆయా భాషల్లోకి అనువదించుకుని అధ్యయనం చేశారని తెలియజేశారు. భక్తి సాహిత్యం రామానుజుల ప్రేరణతో మధురభక్తి సాహిత్యంగా ప్రాచుర్యం పొందిందన్నారు. శ్రీకృష్ణదేవరాయలు రచించిన ఆముక్తమాల్యద గ్రంథంలో సందర్భానుసారంగా వేదార్థ సంగ్రహంలోని పలు అంశాలను ప్రస్తావించారని తెలిపారు. రామానుజుల వారి జానపద బాణీలోని గేయాలు తెలంగాణలో తిరునామాలుగా ప్రసిద్ధి చెందాయన్నారు.

అనంతరం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీ‌మ‌ధుసూద‌న‌రావు బృందం ఆలపించిన సంకీర్తనలు భక్తులను ఆకట్టుకున్నాయి.

ఈ కార్యక్రమంలో టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల అధికారి శ్రీ విజ‌య‌సార‌థి, ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు కో-ఆర్డినేట‌ర్ శ్రీ పురుషోత్తం, ప్రోగ్రాం అసిస్టెంట్ శ్రీ‌మ‌తి కోకిల, స్థానిక భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.