RATHA SAPTAMI TO BE OBSERVED AT TIRUMALA ON JAN 25 _ జనవరి 25న తిరుమలలో రథసప్తమి
SRI MALAYAPPA SWAMY TO BLESS DEVOTEES ON SEVEN VAHANAMS IN A SINGLE DAY
Tirumala, 18 January 2026: On the auspicious occasion of Surya Jayanthi, the sacred festival of Ratha Saptami will be observed at Tirumala on January 25. On this occasion, Sri Malayappa Swamy will take procession on seven different vahanams along the Mada Streets of the temple, granting darshan to devotees.
Ratha Saptami, also known as Magha Saptami, falls on the Shukla Paksha Saptami of the holy Magha month. According to the Vedas, this highly sacred day marks the birth of Surya, who bestowed knowledge upon the entire world. Anticipating a large influx of devotees on this occasion, TTD has made elaborate arrangements. Ratha Saptami is also popularly referred to as the Mini Brahmotsavams.
Details of Vahana Sevas:
• 5.30 AM to 8 AM (Sunrise at 6.45 AM) – Surya Prabha Vahanam.
• 9 AM to 10 AM– Chinna Sesha Vahanam.
• 11 AM to 12 noon – Garuda Vahanam.
• 1 PM to 2 PM – Hanumantha Vahanam.
• 2 PM to 3 PM – Chakra Snanam.
• 4 PM to 5 PM – Kalpavriksha Vahanam.
• 6 PM to 7 PM – Sarvabhoopala Vahanam.
• 8 PM to 9 PM – Chandra Prabha Vahanam.
Cancellation of Arjitha Sevas:
In view of the festival, Kalyanotsavam, Unjal Seva, Arjitha Brahmotsavam, and Sahasra Deepalankara Seva will be cancelled. However, Suprabhatam, Thomala Seva, and Archana will be performed in ekantham.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
ఒకే రోజు ఏడు వాహనాలపై భక్తులను కటాక్షించనున్న శ్రీ మలయప్ప
తిరుమల, 2026 జనవరి 18: సూర్య జయంతి సందర్భంగా జనవరి 25వ తేదీన తిరుమలలో రథసప్తమి పర్వదినం జరుగనుంది. ఈ సందర్భంగా ఏడు వాహనాలపై స్వామివారు ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.
పవిత్రమైన మాఘ మాసంలో శుక్ల పక్ష సప్తమి తిథిని రథ సప్తమి లేదా మాఘ సప్తమి అని పిలుస్తారు. ఈ పరమ పవిత్రమైన రోజున శ్రీ సూర్యదేవుడు జన్మించాడని, ప్రపంచం మొత్తానికి జ్ఞానం ప్రసాదించాడని వేదాల ద్వారా తెలుస్తోంది. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని భారీ సంఖ్యలో తిరుమలకు విచ్చేసే భక్తుల కోసం టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేస్తోంది. రథసప్తమిని మినీ బ్రహ్మోత్సవాలు అని కూడా అంటారు.
వాహనసేవల వివరాలు :
• తెల్లవారుజామున 5.30 నుంచి 8 గంటల వరకు(సూర్యోదయం ఉదయం 6.45 గంటలకు) – సూర్యప్రభ వాహనం.
• ఉదయం 9 నుంచి 10 గంటల వరకు – చిన్నశేష వాహనం.
• ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు – గరుడ వాహనం.
• మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు – హనుమంత వాహనం.
• మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు – చక్రస్నానం.
• సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు – కల్పవృక్ష వాహనం.
• సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు – సర్వభూపాల వాహనం.
• రాత్రి 8 నుంచి 9 గంటల వరకు – చంద్రప్రభ వాహనం.
ఆర్జిత సేవలు రద్దు :
ఈ పర్వదినం కారణంగా ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. కాగా, సుప్రబాతం, తోమాల, అర్చన ఏకాంతంలో నిర్వహిస్తారు.
