RATHA SAPTHAMI FETE AT NARAYANAVANAM TEMPLE _ నారాయణవనం శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు

Tirupati,16 February 2024: Ratha Sapthami fete was held grandly at Sri Kalyana Venkateswara temple in Narayanavanam with special cultural Programs and day-long vahanams including Tiruchi utsavam to bless devotees.

Artists from HDPP, Dasa Sahitya projects presented cultual programs. 

AEO Sri Parthasarathy, Superintendent Sri Dharmayya and temple inspector Sri Narayana were present.                                             

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

నారాయణవనం శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు

తిరుపతి, 2024 ఫిబ్ర‌వరి 16: నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ర‌థ‌స‌ప్త‌మి పర్వదినాన్ని శుక్రవారం అత్యంత వైభ‌వంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆల‌యంలో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు.

ఉదయం సూర్యుని కిర‌ణాలు సూర్యప్రభ వాహనంలో కొలువైన స్వామి, అమ్మ‌వార్ల‌పై ప్రసరించడాన్ని భక్తులు దర్శించుకుని ఆనందపరవశులయ్యారు.

ఉదయం 6.30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు సూర్యప్రభ, చిన్నశేష, పల్లకీ, కల్పవృక్ష, పెద్దశేష వాహన సేవలు, తిరుచ్చి ఉత్సవం నిర్వ‌హించారు.

సాయంత్రం 6.30 గంటలకు చంద్రప్రభ వాహనాలపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.

ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచారపరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజన కార్యక్రమాలు జరిగాయి

ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో శ్రీ పార్థసారథి, సూప‌రింటెండెంట్ ధర్మయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ నారాయణ పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.