RATHA SAPTHAMI FETE AT SRI GT _ రథ సప్తమి రోజున భక్తులకు శ్రీ గోవిందరాజస్వామి కటాక్షం
Tirupati, 16 February 2024:Ratha Sapthami celebrations at Sri Govindarajaswami temple kicked off on Friday with Sri Chakrathalwar procession in early hours to Alwar Thirtham at Sri Kapileswara temple and thereafter both swami and ammavaru blessing devotees riding several vahanas.
From Surya Prabha Vahana in early morning the Swami rode on Garuda Vahana at night to culminate the vahana sevas.
DyEO Smt Shanti, AEO Sri Munikrishna Reddy, Superintendent Sri Mohan Rao and temple inspector Sri Dhananjaya were present.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
రథ సప్తమి రోజున భక్తులకు శ్రీ గోవిందరాజస్వామి కటాక్షం
తిరుపతి, 2024 ఫిబ్రవరి 16: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామి, అమ్మవార్లు వాహనాలపై ఊరేగి భక్తులను కటాక్షించారు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు శ్రీచక్రత్తాళ్వార్‌ను ఊరేగింపుగా శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలోని ఆళ్వారు తీర్థానికి వేంచేపు చేసి చక్రస్నానం నిర్వహించారు.
అనంతరం ఉదయం 5.30 గంటలకు సూర్యప్రభ వాహనంతో వాహన సేవలు ప్రారంభమయ్యాయి. వరుసగా సూర్యప్రభ, హంస, హనుమంత, పెద్దశేష, ముత్యపుపందిరి, సర్వభూపాల వాహనాలపై స్వామివారు భక్తులకు కనువిందు చేశారు.
సాయంత్రం 7 నుండి రాత్రి 8.30 గంటల వరకు విశేషమైన గరుడవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈవో శ్రీ ముని కృష్ణారెడ్డి, సూపరింటెండెంట్లు శ్రీ మోహన్ రావు, శ్రీ నారాయణ టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ ధనంజయ పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.